జగన్ ప్రభుత్వంపై ఆనందయ్య కీలక వ్యాఖ్యలు

దిశ, ఏపీ బ్యూరో : ఏపీ ప్రభుత్వంపై ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య అసహనం వ్యక్తం చేశారు. మందు పంపిణీకి ప్రభుత్వం సహకరించడం లేదన్నారు. కరోనా మందు తయారీకి సామగ్రి లేక తయారీలో వెనుకబడ్డామని ఆనందయ్య అన్నారు. ప్రకాశం జిల్లాలో కరోనా మందును ఆయన పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్బంగా ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మందు పంపిణీకి ప్రభుత్వం సహకరించక పోవడం బాధాకరమన్నారు. తాను తయారు చేసే మందు బయట బడ్డీ బంకుల్లో అమ్ముతున్నారంటే అది ప్రభుత్వ […]

Update: 2021-06-23 03:41 GMT

దిశ, ఏపీ బ్యూరో : ఏపీ ప్రభుత్వంపై ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య అసహనం వ్యక్తం చేశారు. మందు పంపిణీకి ప్రభుత్వం సహకరించడం లేదన్నారు. కరోనా మందు తయారీకి సామగ్రి లేక తయారీలో వెనుకబడ్డామని ఆనందయ్య అన్నారు. ప్రకాశం జిల్లాలో కరోనా మందును ఆయన పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్బంగా ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మందు పంపిణీకి ప్రభుత్వం సహకరించక పోవడం బాధాకరమన్నారు. తాను తయారు చేసే మందు బయట బడ్డీ బంకుల్లో అమ్ముతున్నారంటే అది ప్రభుత్వ లోపంగానే భావించాలన్నారు. అటు వంటి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి జిల్లాలో కరోనా మందు అందజేస్తామని తెలిపారు. ప్రతీ ఒక్కరికీ ఉచితంగా మందు పంపిణీ చేయాలన్నదే తన అభిమతమని ఆనందయ్య స్పష్టం చేశారు.

Tags:    

Similar News