ఆనందయ్య మందు ఎలా వాడాలి, ఎవరు వాడాలి.. వివరాలు ఇవే

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా నివారణ కోసం నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య.. ఆయుర్వేద మందును తయారు చేసిన విషయం తెలిసిందే. ఈ మందును ఇప్పటికే కొందరు తీసుకోగా.. త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది. అయితే ఈ మందును ఎలా తీసుకోవాలి.? ఎవరు వాడకూడదు.? అనే విషయాలను ఆనందయ్య ఓ ప్రకటనలో తెలిపారు. మందు ఎలా వాడాలి..? కరోనా రాని వారు.. – కరోనా రాని వారు ‘P’ అనే రకం మందును.. ఉదయాన్నే పరగడపున […]

Update: 2021-06-03 06:40 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా నివారణ కోసం నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య.. ఆయుర్వేద మందును తయారు చేసిన విషయం తెలిసిందే. ఈ మందును ఇప్పటికే కొందరు తీసుకోగా.. త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది. అయితే ఈ మందును ఎలా తీసుకోవాలి.? ఎవరు వాడకూడదు.? అనే విషయాలను ఆనందయ్య ఓ ప్రకటనలో తెలిపారు.

మందు ఎలా వాడాలి..?

కరోనా రాని వారు..

– కరోనా రాని వారు ‘P’ అనే రకం మందును.. ఉదయాన్నే పరగడపున చింతగింజ సైజులో వేసుకోవాలి.
– మళ్లీ రాత్రి భోజనానికి ముందు చింతగింజ సైజులో వేసుకోవాలి. ( ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనానికి అరగంట ముందు తీసుకోవాలి.
– ఇలా రెండు రోజులు తీసుకోవాలి.
– తిరిగి పది రోజుల తర్వాత ఇదే విధంగా మళ్లీ ఒక్క రోజు మందు వేసుకోవాలి.

కరోనా వచ్చిన వారు..

– ‘P’ అనే రకం మందును.. ఉదయాన్నే పరగడపున చింతగింజ సైజులో వేసుకోవాలి.
– మళ్లీ రాత్రి భోజనానికి ముందు చింతగింజ సైజులో వేసుకోవాలి. ( ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనానికి అరగంట ముందు తీసుకోవాలి.
– ఇలా మూడు రోజులు తీసుకోవాలి.
– ‘F’ అనే రకం మందును ఉదయాన్నే టిఫిన్‌తో పాటు గోలీ సైజులో వేసుకోవాలి. ( P రకం మందు తీసుకున్న 30 నిమిషాల తర్వాత వేసుకోవాలి.
– ఇలా F రకం మందును 2 రోజులు తీసుకోవాలి.
– ‘L’ అనే రకం మందును భోజనం ముందు గోలీ సైజులో వేసుకోవాలి. ( ‘F’ రకం మందు తీసుకున్న 3 గంటల తర్వాత ఇది వేసుకోవాలి).
– ఇలా మూడు రోజులు తీసుకోవాలి.

గమనిక : కరోనా తీవ్రత ఎక్కువగా ఉంటే.. F,L మూడవ రోజు కూడా తీసుకోవచ్చు.

ఆక్సీజన్ లెవల్స్ తగ్గిన వారికి కంటి చుక్కల మందు..

– ‘I’ అనే రకం మందు రెండు కళ్లలో ఒక్క చుక్క చొప్పున వేసుకుని 5 నిమిషాలు వెయిట్ చేయాలి.
– ఒకవేళ కళ్లు మంటలు రాకపోతే పైన తెలిపిన విధంగా 2 సార్లు 15 నిమిషాల వ్యవధిలో వేయవలెను.

ముఖ్య గమనిక..

– మందు తీసుకున్నాక మాంసాహారం తినరాదు.
– గర్భిణీలు వాడరాదు.
– మహిళలు రుతు క్రమం సమయంలో వాడరాదు.
– మందును ఫ్రిజ్‌లో ఉంచకూడదు.
– ఆకలి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలి.
– రోజులో 5 లీటర్లు తక్కువ కాకుండా నీరు తీసుకోవాలి.

 

Tags:    

Similar News