ప్యాట్రిక్ కొలిసన్ కు షాక్.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ మామూలుగా లేదుగా..

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల భారతీయులు అన్ని రంగాల్లో రాణిస్తూ విజయకేతనాలు ఎగురవేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ట్వి్ట్టర్ కు కూడా ఒక భారతీయుడు సీఈఓగా నియమితుడు కావడం సంచలనమే రేపింది. అన్ని సోషల్ మీడియాలతో పాటు దిగ్గజ కంపెనీలలో కీలక పాత్రలు పోషిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక ట్విట్టర్ కు తన కొత్త సీఈఓ గా పరాగ్ అగర్వాల్ ను ప్రకటించగానే ఒక్క భారత్ నుంచే కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. ఐరీష్ బిలీనియర్, […]

Update: 2021-12-01 22:54 GMT

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల భారతీయులు అన్ని రంగాల్లో రాణిస్తూ విజయకేతనాలు ఎగురవేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ట్వి్ట్టర్ కు కూడా ఒక భారతీయుడు సీఈఓగా నియమితుడు కావడం సంచలనమే రేపింది. అన్ని సోషల్ మీడియాలతో పాటు దిగ్గజ కంపెనీలలో కీలక పాత్రలు పోషిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక ట్విట్టర్ కు తన కొత్త సీఈఓ గా పరాగ్ అగర్వాల్ ను ప్రకటించగానే ఒక్క భారత్ నుంచే కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి.

ఐరీష్ బిలీనియర్, స్ట్రైప్ కో ఫౌండర్ ప్యాట్రిక్ కొలిసన్ కూడా ట్విట్టర్ నూతన సీఈఓను అభినందిస్తూ ట్విట్ చేశాడు. అయితే అందులో కొంత కాంట్రవర్సి ఉండటంతో భారత ఇండస్ట్రీలిస్ట్ ఆనంద్ మహీంద్రా దిమ్మతిరిగి బొమ్మ కనిపించే కౌంటర్ ఇచ్చారు. చాలా ఇంటర్నేషనల్ సంస్థలకు భారతీయులు సీఈఓలు అయ్యారు, అయితే వలస వాదులకు అమెరికా మంచి స్థానాలు కల్పిస్తోందని ప్యాట్రిక్ ఎద్దేవా చేశాడు.

ప్యాట్రిక్ ట్వీట్ ను రీ ట్వీట్ చేస్తూ.. ‘ఇది భారత్ నుంచి వచ్చిన ప్యాండమిక్. దీనికి వ్యాక్సిన్ కూడా కనుగొనబడలేదు, ఇండియా నుంచి ఈ వ్యాధి వ్యాపించింది అనడానికి మేం గర్విస్తున్నాం, ఇది ఇండియన్ సీఈఓ వైరస్’ అంటూ చురకలు అంటించాడు.

Tags:    

Similar News