అమెరికాలో ‘డబ్బావాలి’.. ఆనంద్ మహింద్రా ట్వీట్ వైరల్..!
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో పాఠశాలలకు, కాలేజీలకు వెళ్లే విద్యార్థుల నుంచి పనులకు వెళ్లే కార్మికులు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు అందరూ ‘లంచ్ బాక్స్’ తీసుకెళ్లడం ఇక్కడ కామన్. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఈ లంచ్ బాక్సులను ‘డబ్బా’ (స్టీల్ టిఫిన్ బాక్స్) అని పిలుస్తుంటారు. వీటిని తీసుకెళ్లడానికి అక్కడ ‘డబ్బా వాలాలు’ వెరీ ఫేమస్. కానీ, విదేశాల్లో లంచ్ బాక్స్ తీసుకెళ్లి భోజనం చేసే విధానం ఎక్కువగా కనిపించకపోవచ్చు. వారంతా రెస్టారెంట్లలో రెడిమేడ్ లైఫ్‌కు […]
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో పాఠశాలలకు, కాలేజీలకు వెళ్లే విద్యార్థుల నుంచి పనులకు వెళ్లే కార్మికులు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు అందరూ ‘లంచ్ బాక్స్’ తీసుకెళ్లడం ఇక్కడ కామన్. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఈ లంచ్ బాక్సులను ‘డబ్బా’ (స్టీల్ టిఫిన్ బాక్స్) అని పిలుస్తుంటారు. వీటిని తీసుకెళ్లడానికి అక్కడ ‘డబ్బా వాలాలు’ వెరీ ఫేమస్. కానీ, విదేశాల్లో లంచ్ బాక్స్ తీసుకెళ్లి భోజనం చేసే విధానం ఎక్కువగా కనిపించకపోవచ్చు. వారంతా రెస్టారెంట్లలో రెడిమేడ్ లైఫ్‌కు బాగా అలవాటు పడి ఉంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే.. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహింద్రా ‘టిఫిన్ బాక్స్’ నేపథ్యాన్ని ట్విట్టర్ వేదికగా మరోసారి గుర్తుచేసి భావోద్వేగానికి లోనయ్యారు.
New York, Central Park. Dabba walli pic.twitter.com/vMZmToLbOH
— anand mahindra (@anandmahindra) August 19, 2021
ఓ మహిళ స్టీల్ టిఫిన్ క్యారియర్ పట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్న ఫోటోను ఆయన నెటిజన్లతో పంచుకున్నారు. ‘‘న్యూయార్క్, సెంట్రల్ పార్క్, డబ్బా వాలీ” అనే క్యాప్షన్‌తో ఈ ఫొటోను నిన్న ట్విట్టర్‌లో షేర్ చేశారు. అగ్రరాజ్యం అమెరికాలోని న్యూయార్క్ స్టేట్‌లో ఒక మహిళ ఆఫీస్‌కు వెళ్తూ ‘లంచ్ బాక్స్’ (స్టీల్ టిఫిన్ డబ్బా)ను తీసుకెళ్తున్నట్టు ఆ దృశ్యంలో కనిపిస్తోంది. ముంబైలో పేరుమోసిన ‘డబ్బావాలా’ సేవలను గుర్తుచేసేలా ఈ ఫోటోకు ‘డబ్బావాలి’ అని కామెంట్ పెట్టడంతో నెట్టింట్లో వైరల్‌గా మారింది. స్టీల్ టిఫిన్ బాక్స్‌లతో బలమైన అనుబంధమున్న ఇండియన్స్ ఈ పిక్చర్‌ను తెగ స్ప్రెడ్ చేస్తున్నారు.
స్టీల్ టిఫిన్ బాక్స్‌ను తీసుకెళ్లడం ఇండియాలో సాధారణ విషయమే. కానీ, న్యూయార్క్‌లో ఒక మహిళ స్టీల్ డబ్బాను ఇలా తీసుకెళ్లడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పుడు విదేశీ అలవాట్లను మనవాళ్లు ఫాలో అయితే, ప్రస్తుతం భారతీయుల అలవాట్లను వాళ్లు ఫాలో అవుతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘స్టీల్ టిఫిన్స్ బాక్సులు.. చిన్ననాటి జ్ఞాపకాలను తట్టి లేపాయని’ అని భావేద్వాగానికి లోనవుతున్నారు.