ఆర్ఎంపీ డాక్టర్ అరాచకం: దానికోసం రోగిని గదిలో నిర్బంధించి..

దిశ, కుక్కునూరు: పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడు మండలంలో ఆర్ఎంపీ వైద్యులు పెట్రేగిపోతున్నారు. ఇష్టానుసారంగా రోగులకు వైద్యం చేస్తూ ఆడిందే ఆటగా పాడిందే పాటగా వ్యవహరిస్తున్నారు. కాగా, ప్రాధమిక వైద్యం కోసం ఆర్ఎంపీలను ఆశ్రయిస్తే అధిక ఫీజు కోసం తమను పీల్చిపిప్పి  చేస్తున్నారని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వేలేరుపాడు మండల కేంద్రంలో అధిక ఫీజు కోసం ఓ రోగిని గదిలో నిర్బంధించాడు ఓ ఆర్ఎంపీ వైద్యుడు.  అంతేకాకుండా రోగి ప్రాణాలు పోయి చివరకు శవాన్ని అప్పగించాలన్నా […]

Update: 2021-08-15 23:35 GMT

దిశ, కుక్కునూరు: పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడు మండలంలో ఆర్ఎంపీ వైద్యులు పెట్రేగిపోతున్నారు. ఇష్టానుసారంగా రోగులకు వైద్యం చేస్తూ ఆడిందే ఆటగా పాడిందే పాటగా వ్యవహరిస్తున్నారు. కాగా, ప్రాధమిక వైద్యం కోసం ఆర్ఎంపీలను ఆశ్రయిస్తే అధిక ఫీజు కోసం తమను పీల్చిపిప్పి చేస్తున్నారని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వేలేరుపాడు మండల కేంద్రంలో అధిక ఫీజు కోసం ఓ రోగిని గదిలో నిర్బంధించాడు ఓ ఆర్ఎంపీ వైద్యుడు. అంతేకాకుండా రోగి ప్రాణాలు పోయి చివరకు శవాన్ని అప్పగించాలన్నా డబ్బులు కట్టాల్సిందేనని బాధిత కుటుంబానికి ఆర్ఎంపీ వైద్యుడు తెగేసి చెప్పాడు. ఫీజు విషయంలో కనికరం లేకుండా వ్యవహరిస్తున్న ఊహా సుస్మిత ప్రజావైద్యశాలపై చర్యలు తీసుకోవాలని బాధిత రోగులు డిమాండ్ చేస్తున్నారు.

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నడిమిగొమ్ము కాలనీకి చెందిన చీమల వెంకటేశ్వర్లు వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్నాడు. గత శనివారం తమ 13 ఏళ్ల కుమారుడు విజ్ఞేష్ కి కడుపునొప్పి రావడంతో స్థానిక ఊహా సుస్మిత ప్రజావైద్యశాలకు తీసుకెళ్లారు. వైదుడు విజయబాబు చికిత్స చేసి ఫీజు ఎక్కువ మొత్తంలో చెల్లించాలని డిమాండ్ చేశాడు. అంత ఇవ్వలేమని చెప్పడంతో.. ఫీజు ఇచ్చేవరకు బాలుడిని వదిలేది లేదు అంటూ బాలుడుని గదిలో పెట్టి వైద్యుడు నిర్బంధించారని బాధితులు మీడియా ఎదుట వాపోయారు. అంతేకాకుండా చివరకు చస్తే శవాన్ని అప్పగించాలన్నా డబ్బులు కట్టి తీరాల్సిందేనని వైద్యుడు బెదిరించారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఇదే డాక్టర్ వారం రోజుల క్రితం సరిత అనే యువతి విషయంలోనూ ఇలాగే ప్రవర్తించాడని, చికిత్స అనంతరం ఫీజును ఎక్కువగా చెల్లిస్తేనే చేతికి ఉంచిన ఐవీని తొలగిస్తానని వైద్యుడు ఒత్తిడి చేసినట్లు తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ స్పందించి చికిత్స కోసం అధిక ఫీజులు వసూలు చేస్తూ, రోగులను ఒత్తిడి చేస్తున్న ఊహా సుస్మిత ప్రజావైద్యశాల నిర్వహకుడుపై తగు చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

Tags:    

Similar News