రూ. 86కే ఇల్లు సొంతం చేసుకునే అవకాశం!

దిశ, వెబ్‌డెస్క్ : ప్రతి మనిషి తన కోసం కోట్లు సంపాదించుకోకపోయినా.. ఉండటానికి ఓ ఇల్లు మాత్రం కావాలనుకుంటాడు. ఈ కాలంలో ఇల్లు కట్టాలంటే ఎంత ఖర్చవుతుందో? అందుకోసం ఎంత శ్రమ పడాలో? వేరే చెప్పనక్కర్లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే.. మెజర్టీ ప్రజలకు సొంతిల్లు అనేది చిరకాల కల. ఆ కలను నెరవేర్చుకునేందుకు జీవితాంతం కష్టపడతుంటారు. అలాంటిది.. చికెన్ కన్నా చీప్‌గా, సినిమా టిక్కెట్ రేటు కన్నా తక్కువగా, ఇంచుమించు లీటర్ పెట్రోల్ ధరలో ఏకంగా ఇల్లు సొంతమవుతుందంటే […]

Update: 2020-10-29 01:06 GMT

దిశ, వెబ్‌డెస్క్ :
ప్రతి మనిషి తన కోసం కోట్లు సంపాదించుకోకపోయినా.. ఉండటానికి ఓ ఇల్లు మాత్రం కావాలనుకుంటాడు. ఈ కాలంలో ఇల్లు కట్టాలంటే ఎంత ఖర్చవుతుందో? అందుకోసం ఎంత శ్రమ పడాలో? వేరే చెప్పనక్కర్లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే.. మెజర్టీ ప్రజలకు సొంతిల్లు అనేది చిరకాల కల. ఆ కలను నెరవేర్చుకునేందుకు జీవితాంతం కష్టపడతుంటారు. అలాంటిది.. చికెన్ కన్నా చీప్‌గా, సినిమా టిక్కెట్ రేటు కన్నా తక్కువగా, ఇంచుమించు లీటర్ పెట్రోల్ ధరలో ఏకంగా ఇల్లు సొంతమవుతుందంటే నమ్ముతారా? అయితే, ఆ అద్భుత అవకాశం ఎక్కడో తెలుసుకోవాల్సిందే.

ఇట‌లీ, సిసిలిలోని సలేమి విలేజ్‌లో ఒకప్పుడు 4 వేల కుటుంబాలు నివసించేవి. కానీ ఇప్పుడు అక్కడ జనాభానే లేకుండా పోయింది? అసలేం జరిగిందంటే.. 1968లో సిసిలీలోని బెలిస్ వ్యాలీలో సంభవించిన భూకంపం కారణంగా అక్క‌డి ప్రాంతమంతా అస్తవ్యస్తం కావడంతో.. ప్రజలంతా భయపడిపోయారు. దాంతో సలేమీలో ఉండలేక.. ఒక్కొక్కరుగా ఆ ప్రాంతం నుంచి వేరే ఊర్లకు వలస వెళ్లారు. ఈ క్రమంలోనే అక్క‌డ నివ‌సించేవారి జ‌నాభా పూర్తిగా త‌గ్గిపోయింది. ప‌రిస్థితి ఇలాగే కొన‌సాగితే, ఆ ప్రాంతమంతా నిర్మానుష్యంగా మారిపోయేలా కనిపిస్తోంది. దీంతో ‘ఒక్క యూరో(రూ. 86/-)కే ఇల్లు’ అంటూ ప్రభుత్వం ఓ కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం ఆశించినట్లు ఈ పథకం జనాలకు నచ్చి, ఇల్లు కొనుక్కోవడంతో పాటు అక్కడే నివాసముంటే లక్ష్యం నెరవేరినట్లే.

స‌లేమీలో నివాస‌యోగ్య‌మైన‌ పాత‌ ఇండ్లను గుర్తించి వేలానికి సిద్ధంగా ఉంచారు. ‘సిటీ కౌన్సిల్‌కు చెందిన అన్ని భవనాలను వేలం వేస్తున్నాం. ఈ స్కీమ్ లాంచ్ చేయకుముందే.. సలేమీలోని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సర్వీస్‌లను పునరుద్ధరించాం. రోడ్లు, ఎలక్ట్రిక్ గ్రిడ్స్, సీవేజ్ పైప్స్ అన్నీ కూడా బాగు చేశాం. సలేమి ఇప్పుడు నివాసయోగ్యానికి అనువుగా మారిపోయింది’ అని అక్కడి అధికారులు తెలిపారు.

ఈ స్కీమ్ అంతా కూడా లైవ్‌లోనే జరుగుతోందని, ఎవరికైనా ఇల్లు కావాల్సి వస్తే.. సిటీ కౌన్సిల్ ఇన్‌స్టిట్యూషనల్ వెబ్‌సైట్ నుంచి అప్లికేషన్ ఫార్మ్ డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు తెలిపారు.

Tags:    

Similar News