కోడి ముందా, గుడ్డు ముందా.. హమ్మయ్య ఈ ప్రశ్నకు సమాధానం దొరికింది!
దిశ, డైనమిక్ బ్యూరో: కోడి ముందా? గుడ్డు ముందా? అన్న ప్రశ్న ఎన్నో ఏళ్లుగా అంతుచిక్కకుండా మిగిలిపోయింది. సమాధానం ఏదేమైనప్పటికీ, ప్రతీ షోలో ఈ ప్రశ్నను లేవనెత్తి సందడి చేయడం మాత్రం ఆగడంలేదు. ఈ ప్రశ్నకు కొందరు కోడి ముందు పుట్టి గుడ్డును పెట్టిందని, మరికొందరు గుడ్డులో నుంచి కోడి పుట్టిందని ఇలా ఎవరికి తోచింది వాళ్లు చెప్పుకొచ్చేవారు. కానీ, ఈ ప్రశ్నను సీరియస్‌గా తీసుకున్న అమెరికా జర్నలిస్ట్ రాబర్ట్ క్రుల్విచ్ సమాధానం కోసం పరిశోధనలు చేయడం […]
దిశ, డైనమిక్ బ్యూరో: కోడి ముందా? గుడ్డు ముందా? అన్న ప్రశ్న ఎన్నో ఏళ్లుగా అంతుచిక్కకుండా మిగిలిపోయింది. సమాధానం ఏదేమైనప్పటికీ, ప్రతీ షోలో ఈ ప్రశ్నను లేవనెత్తి సందడి చేయడం మాత్రం ఆగడంలేదు. ఈ ప్రశ్నకు కొందరు కోడి ముందు పుట్టి గుడ్డును పెట్టిందని, మరికొందరు గుడ్డులో నుంచి కోడి పుట్టిందని ఇలా ఎవరికి తోచింది వాళ్లు చెప్పుకొచ్చేవారు. కానీ, ఈ ప్రశ్నను సీరియస్‌గా తీసుకున్న అమెరికా జర్నలిస్ట్ రాబర్ట్ క్రుల్విచ్ సమాధానం కోసం పరిశోధనలు చేయడం మొదలెట్టారు.
సుధీర్ఘకాలం పాటు శ్రమించిన ఆయన ఎట్టకేలకు సమాధానాన్ని కనిపెట్టి ఆయన జర్నల్‌లో ప్రచురించారు. ‘‘దీని ప్రకారం చాలా ఏళ్ల క్రితం అసలు కోళ్లు లేవు, కోడిలాగే ప్రోటో కోడి అనే పెద్ద పక్షులు ఉండేవి. అయితే, అవి 3 కిలోల నుంచి 5 కిలోలు ఆపైన బరువుతో ఉండేవి. క్రమంగా మార్పు చెందుతూ, జన్యు మార్పిడితో అవి కోళ్లలా తయారయ్యాయి. అవి పెట్టిన గుడ్డు నుంచే ఇప్పుడున్న కోళ్లు వచ్చాయి.’’ అని జర్నల్‌లో ప్రచురించారు. దీంతో ఎన్నో ఏళ్లనుంచి ప్రశ్నార్థకంగా మారిన సమస్యకు సమాధానం ఇదేనంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు.