ఓ స్త్రీ శక్తి అంటూ బ్యూటిఫుల్ పిక్స్ షేర్ చేసిన మెగా బ్యూటీ.. కుందనపు బొమ్మలా ఉన్నావంటూ నెటిజన్ల కామెంట్స్
మిల్క్ బ్యూటీ తమన్నా(Thamannah) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: మిల్క్ బ్యూటీ తమన్నా(Thamannah) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మంచి ఫేమ్ తెచ్చుకుంది. ప్రస్తుతం ‘ఓదెల-2’(Odela-2) సినిమాలో నటిస్తోంది. ఇది సూపర్ హిట్ ‘ఓదెల రైల్వే స్టేషన్’(Railway Station)కు సీక్వెల్‌గా వస్తున్న మూవీ. అలాగే మరోపక్క ఐటెమ్ సాంగ్స్‌లో డ్యాన్స్ చేస్తూ తన అందాలతో వావ్ అనిపిస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా తమన్నా తన సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది.
అందులో పింక్ కలర్ శారీ కట్టుకుని ట్రెడిషనల్ లుక్‌లో కనిపించింది. ఇక ఈ ఫొటోస్‌కు ‘ఓ స్త్రీ శక్తి.. ఓదెల-2 ఏప్రిల్ 17న థియేటర్లలో రాబోతుంది’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పిక్స్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు పింక్ శారీలో కుందనపు బొమ్మలా ఉన్నావని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ బ్యూటీ పోస్ట్ పై మీరు కూడా ఓ లుక్ వేసేయండి.
Read More..
బ్యాక్ ఇన్ జటాధర మోడ్ అంటూ ఆ ఫొటో షేర్ చేసిన బాలీవుడ్ బ్యూటీ.. నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్