భారతీయ చిత్రకారిణి పెయింటింగ్‌కు రూ. 37.8 కోట్లు!
దిశ, ఫీచర్స్ : జెన్ తత్వశాస్త్రం, ఆధ్యాత్మిక బోధనలతో ప్రేరణ పొందిన ఆర్టిస్ట్ వీఎస్ గైతోండే ఎన్నో అద్భుతమైన పెయింటింగ్స్ వేసిన విషయం తెలిసిందే. ఆయన 1961లో వేసిన ఓ పేరు పెట్టని ఆయిల్ పెయింటింగ్‌ను ఇటీవలే ముంబైకి చెందిన శాఫ్రోనెట్ వర్క్ వేలం వేయగా.. రూ. 39.98 కోట్లకు అమ్ముడుపోయి, ఇప్పటి వరకు అత్యధిక ధర పలికిన భారతీయ చిత్తరువుగా నిలిచింది. ఇదిలా ఉంటే, తాజాగా జరిగిన వేలంలో 20వ శతాబ్దానికి చెందిన ప్రముఖ భారతీయ […]
దిశ, ఫీచర్స్ : జెన్ తత్వశాస్త్రం, ఆధ్యాత్మిక బోధనలతో ప్రేరణ పొందిన ఆర్టిస్ట్ వీఎస్ గైతోండే ఎన్నో అద్భుతమైన పెయింటింగ్స్ వేసిన విషయం తెలిసిందే. ఆయన 1961లో వేసిన ఓ పేరు పెట్టని ఆయిల్ పెయింటింగ్‌ను ఇటీవలే ముంబైకి చెందిన శాఫ్రోనెట్ వర్క్ వేలం వేయగా.. రూ. 39.98 కోట్లకు అమ్ముడుపోయి, ఇప్పటి వరకు అత్యధిక ధర పలికిన భారతీయ చిత్తరువుగా నిలిచింది. ఇదిలా ఉంటే, తాజాగా జరిగిన వేలంలో 20వ శతాబ్దానికి చెందిన ప్రముఖ భారతీయ చిత్రకారిణి అమృతా షేర్ గిల్ వేసిన ఓ పెయింటింగ్ రూ. 37.8 కోట్లకు విక్రయించబడి, రెండో స్థానంలో నిలిచింది.
భారతదేశంలో అత్యంత ఖరీదైన పెయింటింగ్స్ వేసిన మహిళా చిత్రకారిణి అమృతానే. ఆమె1938లో వేసిన పెయింటింగ్ ‘ఇన్ ది లేడీస్ ఎన్‌క్లోజర్‘ను ముంబైలోని శాఫ్రోనెట్ వర్క్ వేలం వేయగా, ఏకంగా రూ. 37.8 కోట్ల(5.14 మిలియన్ల అమెరికన్ డాలర్లు)కు అమ్ముడు పోయింది. ఇక ఆర్ట్ మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ ఆర్టరీ ఇండియా ప్రకారం 2018లో ముంబైలో జరిగిన సోథెబై వేలంలో షేర్ గిల్ వేసిన మరో పెయింటింగ్ ‘ది లిటిల్ గర్ల్ ఇన్ బ్లూ ’(1934) రూ 18.7 కోట్లు పలికింది. భారతదేశపు అత్యంత ప్రసిద్ధ మహిళా కళాకారిణి అయిన షేర్ గిల్‌ను భారత ప్రభుత్వం ‘నేషనల్ ట్రెజర్’గా గుర్తించింది. అందువల్ల ఆమె కళను దేశం నుంచి బయటకు తీసుకెళ్లడం చట్టవిరుద్ధం.
అమృతా షేర్ గిల్ నేపథ్యం..
సిక్కు రాచవంశంలో 1913లో జన్మించిన అమృత.. హంగేరియన్ భారతీయ కళాకారిణి కాగా తన బాల్యాన్ని చాలా మటుకు బుడాపెస్ట్‌లోనే గడిపింది. ఐదో ఏట నుంచి చిత్రలేఖనంపై ఇష్టాన్ని పెంచుకున్న తను.. పదహారేళ్ల ప్రాయంలో చిత్రకారిణిగా శిక్షణ పొందేందుకు తల్లితో పాటు ఐరోపా వెళ్లింది. ఈ మేరకు ప్రముఖ చిత్రకారుల వద్ద శిక్షణ పొందిన ఆమె, అక్కడి చిత్రకళా నిపుణుల ప్రభావంతో అనేక పెయింటిగ్స్ వేసింది. 1932లో ఆమె వేసిన ‘యంగ్ గర్ల్స్’ అందరి ప్రశంసలు అందుకోగా, ఆ మరుసటి సంవత్సరం ప్యారిస్‌లోని ‘అసోసియేట్ ఆఫ్ ద గ్రాండ్ సాలోన్’ పురస్కారానికి ఎంపికైంది. ఈ పురస్కారం గ్రహించిన అతి పిన్న వయస్కురాలు, ఆసియాకు చెందిన ఏకైక వ్యక్తి అమృతానే కాగా, 1921లో ఆమె ఇండియాకు వచ్చిన తను తిరిగి 1923లో ఇటలీకి వెళ్లి ఏడాదిపాటు అక్కడి కళాకారులను, వారి కళాఖండాలను గమనించింది. భారతీయ ప్రజల జీవన విధానాన్ని తన కాన్వాస్ ద్వారా ప్రపంచానికి చూపించిన ఆమెను 20 శతాబ్ధపు అత్యంత ప్రతిభావంతురాలైన మహిళా కళాకారిణిగా ప్రభుత్వం గుర్తించింది. కాగా న్యూఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడ్రన్ ఆర్ట్‌లో ఆమె వేసిన కళాత్మకమైన విభిన్నమైన పెయింటింగ్స్ మనం చూడొచ్చు. తన కళాఖండాలతో ఆకట్టుకున్న ఈ కళాకారిణి 1941లో అతి చిన్న (28 సంవత్సరాల) వయసులోనే మరణించింది.
photo :
https://en-media.thebetterindia.com/uploads/2016/01/Untitled-design-33.jpg?compress=true&quality=90&w=480&dpr=2.6