అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ అథారిటీ రద్దు

దిశ, ఏపీ బ్యూరో: మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లును రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై చర్చకు ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అనుమతించారు. బిల్లుపై అసెంబ్లీలో చర్చ కొనసాగుతోంది. ఇకపోతే అమరావతి- సీఆర్డీఏ చట్టాన్ని పునరుద్ధరిస్తూ శాసనసభలో ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టింది. అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ అథారిటీని తక్షణం రద్దు చేస్తున్నట్టు అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించింది. గతంలో రద్దు చేసిన సీఆర్డీఏ చట్టాన్ని తిరిగి పునరుద్ధరిస్తూ బిల్లును […]

Update: 2021-11-22 04:57 GMT
Buggana
  • whatsapp icon

దిశ, ఏపీ బ్యూరో: మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లును రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై చర్చకు ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అనుమతించారు. బిల్లుపై అసెంబ్లీలో చర్చ కొనసాగుతోంది. ఇకపోతే అమరావతి- సీఆర్డీఏ చట్టాన్ని పునరుద్ధరిస్తూ శాసనసభలో ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టింది. అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ అథారిటీని తక్షణం రద్దు చేస్తున్నట్టు అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించింది. గతంలో రద్దు చేసిన సీఆర్డీఏ చట్టాన్ని తిరిగి పునరుద్ధరిస్తూ బిల్లును ప్రవేశపెట్టారు.

ఏఎంఆర్డీఏకు బదలాయించిన ఆస్తులు, ఉద్యోగులను తిరిగి సీఆర్డీఏకు బదిలీ చేస్తున్నట్టు బిల్లులో ప్రస్తావించారు. భాగస్వాములతో పూర్తిస్థాయి సంప్రదింపులు జరపకపోవటం, శాసనమండలిలో బిల్లులు సెలెక్ట్ కమిటీకి వెళ్లటం వంటి అంశాలు వికేంద్రీకరణ చట్టాన్ని వెనక్కి తీసుకోడానికి కారణాలుగా ప్రభుత్వం తెలిపింది. వికేంద్రీకరణపై మరింత అధ్యయనం చేయాల్సిన అవసరముందని భావిస్తున్నట్టు శాసనసభకు ఇచ్చిన ప్రకటనలో ప్రభుత్వం పేర్కోంది. తక్షణమే సీఆర్డీఏ చట్టం 2014 అమల్లోకి వస్తుందని వికేంద్రీకరణ చట్ట ఉపసంహరణ బిల్లులో ప్రభుత్వం పేర్కొంది.

Tags:    

Similar News