పాడేరులో అమ్మవారి విగ్రహం ధ్వంసం

దిశ, విశాఖపట్నం : విజయనగరం జిల్లాలోని రామతీర్థం ఆలయంలో శ్రీరాముడి విగ్రహం తలను నరికేసిన ఘటన మరువక ముందే… తాజాగా శుక్రవారం విశాఖ జిల్లా పాడేరు ఘాట్‌లోని అమ్మవారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండురోజుల క్రితం అమ్మవారి పాదాలను దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అయితే రాష్ట్రంలో ఆలయాలపై వరుసగా జరుగుతున్న ఘటనలపై హిందూ సంఘాలు, భక్తులు ఆగ్రహం […]

Update: 2021-01-01 07:43 GMT

దిశ, విశాఖపట్నం : విజయనగరం జిల్లాలోని రామతీర్థం ఆలయంలో శ్రీరాముడి విగ్రహం తలను నరికేసిన ఘటన మరువక ముందే… తాజాగా శుక్రవారం విశాఖ జిల్లా పాడేరు ఘాట్‌లోని అమ్మవారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండురోజుల క్రితం అమ్మవారి పాదాలను దుండగులు ధ్వంసం చేశారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అయితే రాష్ట్రంలో ఆలయాలపై వరుసగా జరుగుతున్న ఘటనలపై హిందూ సంఘాలు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటనపై హిందూ ధార్మిక సంఘం నాయకలు శ్రీరామ్‌ మాట్లాడుతూ తరుచుగా విగ్రహాల ధ్వంసంతో హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విగ్రహాల ధ్వంసంపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాల తరుపున డిమాండ్‌ చేస్తున్నామన్నారు.

Tags:    

Similar News