అమితాబ్ బచ్చన్ కు కరోనా

బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. తానే స్వయంగా సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ప్రకటించిన బచ్చన్ జి.. ప్రస్తుతం హాస్పిటల్ లో ఉన్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన అధికారిక యంత్రాంగానికి వైద్యులు సమాచారం అందించినట్లు తెలిపారు. కాగా కుటుంబ సభ్యులు సైతం కరోనా టెస్ట్ చేయించుకున్నట్లు తెలిపిన బిగ్ బి.. రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. గత 10 రోజులుగా తనతో కాంటాక్ట్ లో ఉన్న అందరూ కూడా […]

Update: 2020-07-11 12:06 GMT

బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. తానే స్వయంగా సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ప్రకటించిన బచ్చన్ జి.. ప్రస్తుతం హాస్పిటల్ లో ఉన్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన అధికారిక యంత్రాంగానికి వైద్యులు సమాచారం అందించినట్లు తెలిపారు.

కాగా కుటుంబ సభ్యులు సైతం కరోనా టెస్ట్ చేయించుకున్నట్లు తెలిపిన బిగ్ బి.. రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. గత 10 రోజులుగా తనతో కాంటాక్ట్ లో ఉన్న అందరూ కూడా దయచేసి కరోనా టెస్ట్ చేయించుకోవాలని కోరారు.

అయితే బచ్చన్ కు కరోనా పాజిటివ్ ప్రకటనతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన తొందరగా ఈ మహమ్మారి నుంచి కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. బచ్చన్ ఫ్యామిలీ కూడా సేఫ్ గా ఉండాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్.

Tags:    

Similar News