ట్రెండింగ్‌లో ట్రాన్స్.. బైఠీ హై!
దిశ, వెబ్‌డెస్క్: సంగీతం వింటే మత్తెక్కుతుందా? అంటే తప్పకుండా ఎక్కుతుందని సంగీత ప్రియులు చెబుతుంటారు. వారు చెప్పేది నిజమే.. ఇలా ఆల్కహాల్ అవసరం లేకుండానే మత్తెక్కించే పాటలను ‘ట్రాన్స్’ పాటలు అంటారు. వినేవారిని ఒక విధమైన ట్రాన్స్‌లోకి తీసుకెళ్తాయి కాబట్టి వీటిని అలా పిలుస్తారు. ప్రముఖ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది ఇటీవల విడుదల చేసిన ‘బైఠీ హై’ పాట వింటే ఈ మాట నిజమేననిపిస్తోంది. ‘సాంగ్స్ ఆఫ్ ట్రాన్స్’ సిరీస్‌లో భాగంగా అమిత్ త్రివేది కంపోజ్ […]
దిశ, వెబ్‌డెస్క్: సంగీతం వింటే మత్తెక్కుతుందా? అంటే తప్పకుండా ఎక్కుతుందని సంగీత ప్రియులు చెబుతుంటారు. వారు చెప్పేది నిజమే.. ఇలా ఆల్కహాల్ అవసరం లేకుండానే మత్తెక్కించే పాటలను ‘ట్రాన్స్’ పాటలు అంటారు. వినేవారిని ఒక విధమైన ట్రాన్స్‌లోకి తీసుకెళ్తాయి కాబట్టి వీటిని అలా పిలుస్తారు. ప్రముఖ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది ఇటీవల విడుదల చేసిన ‘బైఠీ హై’ పాట వింటే ఈ మాట నిజమేననిపిస్తోంది. ‘సాంగ్స్ ఆఫ్ ట్రాన్స్’ సిరీస్‌లో భాగంగా అమిత్ త్రివేది కంపోజ్ చేసిన ఈ పాటకు షర్మిష్టా ఛటర్జీ, అమితాబ్ భట్టాచార్య గొంతు కలిపారు. ఇప్పుడు ఈ పాట ప్రముఖ మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్స్‌లో టాప్ ప్లేస్‌లో ఉంది. హెడ్‌సెట్ పెట్టుకుని ఈ పాట వింటుంటే, నిజంగా ఏదో ట్రాన్స్‌లోకి వెళ్లిన అనుభూతి కలుగుతోందని సంగీత ప్రియులు అభిప్రాయపడుతున్నారు.
లాక్‌డౌన్ మొదలవగానే సంగీతం మీద తనకున్న ప్రేమను అమిత్ త్రివేది వివిధ ఆల్బమ్ పాటల ద్వారా చాటుకున్నారు. అందుకోసం ‘ఏటీ ఆజాద్’ పేరుతో ఇండిపెండెంట్ సంగీతాన్ని అందిస్తున్నారు. ‘సాంగ్స్ ఆఫ్ ఫెయిత్’ ఆల్బమ్‌తో భక్తిలో ముంచేస్తే, ‘సాంగ్స్ ఆఫ్ డ్యాన్స్’ ఆల్బమ్‌తో కుర్రకారు ఎగిరి గంతేసేలా చేసి, ఇప్పుడు ‘సాంగ్స్ ఆఫ్ ట్రాన్స్’ పేరుతో అందరినీ మత్తులో ముంచేస్తున్నారు. ఈ ఆల్బమ్స్‌లో మోర్నియే, దిల్లీ దీ కుడియా, రాధే, పవన్‌సుత్, మోతీ వేరనా పాటలు చాలా పాపులర్ అయ్యాయి. సినిమాలు లేవని నిరుత్సాహ పడకుండా సంగీతానికి సినిమాలే అవసరం లేదని, ఇండిపెండెంట్ మ్యూజిక్ ద్వారా కూడా అలరించవచ్చని ఈ మోస్ట్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ నిరూపించారు.