ఆసియన్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ సెమీస్‌లో అమిత్ పంగల్
దిశ, స్పోర్ట్స్ : టోక్యో ఒలింపిక్స్ ముందు జరుగుతున్న చివరి మెగా బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత బాక్సర్లు ముందంజలో ఉన్నారు. దుబాల్‌లో జరుగుతున్న ఆసియన్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ అమిత్ పంగల్ 52 కేజీల విభాగంలో సెమీస్‌కు చేరుకున్నాడు. బుధవారం మంగోలియాకు చెందిన ఖర్ఝుతో జరిగిన మ్యాచ్‌లో 3-2 తేడాతో అమిత్ పంగల్ విజయం సాధించి సెమీస్ చేరుకున్నాడు. సెమీఫైనల్‌లో అమిత్ పంగల్ కజకిస్తాన్‌కు చెందిన సాకెన్ బిబోసినొవ్‌తో తలపడనున్నాడు. 2019లో జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్‌లో […]
దిశ, స్పోర్ట్స్ : టోక్యో ఒలింపిక్స్ ముందు జరుగుతున్న చివరి మెగా బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత బాక్సర్లు ముందంజలో ఉన్నారు. దుబాల్‌లో జరుగుతున్న ఆసియన్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ అమిత్ పంగల్ 52 కేజీల విభాగంలో సెమీస్‌కు చేరుకున్నాడు. బుధవారం మంగోలియాకు చెందిన ఖర్ఝుతో జరిగిన మ్యాచ్‌లో 3-2 తేడాతో అమిత్ పంగల్ విజయం సాధించి సెమీస్ చేరుకున్నాడు. సెమీఫైనల్‌లో అమిత్ పంగల్ కజకిస్తాన్‌కు చెందిన సాకెన్ బిబోసినొవ్‌తో తలపడనున్నాడు. 2019లో జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్‌లో సాకెన్‌ను అమిత్ ఓడించాడు. అమిత్ సెమీస్ చేరుకోవడంతో భారత బాక్సింగ్ జట్టుకు ఒక పతకం రావడం ఖాయమైంది. సెమీస్‌లో ఓడినా అమిత్ కాంస్య పతకం గెలుచుకోనున్నాడు.