ఈ ఏడాది పెట్టుబడుల్లో సరికొత్త రికార్డు..

దిశ, వెబ్‌డెస్క్: ఈ ఏడాది ఆగష్టులో స్టాక్ మార్కెట్ల రికార్డులతో పాటు పెట్టుబడుల్లో కూడా సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. సమీక్షించిన నెలలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) దేశీయ మార్కెట్లలోకి మొత్తం రూ. 16,459 కోట్లను పెట్టారు. ప్రధానంగా ఈసారి ఎక్కువ భాగం రుణ విభాగంలో పెట్టుబడులు రావడం విశేషం. ఈక్విటీ మార్కెట్లలోకి కేవలం రూ. 2,083 కోట్లు రాగా, డెట్ మార్కెట్లలోకి ఏకంగా రూ. 14,376 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ప్రస్తుత క్యాలెండర్ ఏడాదిలో రుణ విభాగంలో […]

Update: 2021-09-05 07:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఈ ఏడాది ఆగష్టులో స్టాక్ మార్కెట్ల రికార్డులతో పాటు పెట్టుబడుల్లో కూడా సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. సమీక్షించిన నెలలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) దేశీయ మార్కెట్లలోకి మొత్తం రూ. 16,459 కోట్లను పెట్టారు. ప్రధానంగా ఈసారి ఎక్కువ భాగం రుణ విభాగంలో పెట్టుబడులు రావడం విశేషం. ఈక్విటీ మార్కెట్లలోకి కేవలం రూ. 2,083 కోట్లు రాగా, డెట్ మార్కెట్లలోకి ఏకంగా రూ. 14,376 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ప్రస్తుత క్యాలెండర్ ఏడాదిలో రుణ విభాగంలో ఇదే అత్యధిక పెట్టుబడి.

ముఖ్యంగా అమెరికా పదేళ్ల బాండ్లు 1.30 శాతానికి చేరుకోవడం, భారత పడేళ్ల బాండ్ల రాబడి 6.2 శాతంగా ఉండటం వల్లనే రుణ విభాగంలోకి పెట్టుబడులు పెరిగాయని నిపుణులు పేర్కొన్నారు. అంతేకాకుండా యూఎస్ డాలరుతో రూపాయి మారకం బలంగా ట్రేడ్ అవుతుండటం కూడా పెట్టుబడులకు కలిసొచ్చిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు చెందిన విజయకుమార్ అన్నారు. కాగా, ప్రస్తుత నెలలో సైతం మొదటి మూడు రోజుల్లోనే అత్యధికంగా రూ. 7,768 కోట్ల ఎఫ్‌పీఐలు వచ్చి చేరాయి.

Tags:    

Similar News