కరోనా వ్యాక్సిన్ పై ఆశలు సజీవం
న్యూఢిల్లీ: యావత్ ప్రపంచానికి అమెరికా ఫార్మా కంపెనీ ఫైజర్, జర్మనీ బయోటెక్ కంపెనీ బయో ఎన్‌టెక్ సంస్థలు సోమవారం శుభవార్త తెలిపాయి. ఈ రెండు సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న ఎంఆర్ఎన్ఏ ఆధారిత కరోనా టీకా వైరస్‌ను నివారించడంలో 90శాతం సమర్థత కలిగి ఉన్నట్టు ప్రాథమిక విశ్లేషణలో తేలిందని ప్రకటించాయి. ఈ టీకా మూడో దశ ట్రయల్స్ వివరాలపై ఇండిపెండెంట్ డేటా మానిటరింగ్ కమిటీ చేసిన విశ్లేషణలో విషయం వెల్లడైందని తెలిపాయి. తొలి దశ టీకాలు వైరస్ […]
న్యూఢిల్లీ: యావత్ ప్రపంచానికి అమెరికా ఫార్మా కంపెనీ ఫైజర్, జర్మనీ బయోటెక్ కంపెనీ బయో ఎన్‌టెక్ సంస్థలు సోమవారం శుభవార్త తెలిపాయి. ఈ రెండు సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న ఎంఆర్ఎన్ఏ ఆధారిత కరోనా టీకా వైరస్‌ను నివారించడంలో 90శాతం సమర్థత కలిగి ఉన్నట్టు ప్రాథమిక విశ్లేషణలో తేలిందని ప్రకటించాయి. ఈ టీకా మూడో దశ ట్రయల్స్ వివరాలపై ఇండిపెండెంట్ డేటా మానిటరింగ్ కమిటీ చేసిన విశ్లేషణలో విషయం వెల్లడైందని తెలిపాయి.
తొలి దశ టీకాలు వైరస్ నివారణలో కేవలం 60శాతం లేదా 70శాతం సమర్థతను కలిగి ఉంటాయని అంతా భావించారని, కానీ, తాము అభివృద్ధి చేస్తున్న టీకా 90శాతం సమర్థతను కలిగి ఉన్నట్టు ప్రాథమిక విశ్లేషణలో వెల్లడైందని వివరించాయి. ఈ రోజు శాస్త్ర విజ్ఞానానికి, యావత్ మానవాళికి గొప్ప రోజు అని, ఫేజ్ 3 ట్రయల్స్ ఫస్ట్ సెట్ రిజల్ట్స్ తమ టీకా కరోనాను ఎదుర్కోగలదని నిరూపించాయని ఫైజర్ చైర్మన్, సీఈవో డాక్టర్ అల్బర్ట్ బౌర్లా అన్నారు.
టీకా ట్రయల్స్‌కు సంబంధించిన మరింత సమాచారం వచ్చేవారాల్లో వెల్లడవుతుందని కంపెనీ స్టేట్‌మెంట్ పేర్కొంది. భారీమొత్తంలో వాలంటీర్లపై క్యాండిడేట్లను ప్రయోగించి సత్ఫలితాలు ప్రకటించిన తొలి కంపెనీలుగా ఇవి నిలిచిపోనున్నాయి. ఈ విశ్లేషణలో టీకా సేఫ్టీపై ప్రమాదకర విషయాలేవీ లేనట్టు తేలిందని, అత్యవసర వినియోగానికి అనుమతి కోసం అమెరికా రెగ్యులేటరీలకు ఈ నెలలోనే దరఖాస్తు చేస్తామని ఈ సంస్థలు తెలిపాయి. అందుకు కావాల్సిన సేఫ్టీ, మ్యానుఫ్యాక్చరింగ్ వివరాలను రూపొందించడానికి సిద్ధమవుతున్నాయి.
2020లో ఐదు కోట్ల డోసుల ఉత్పత్తి!
ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా ఈ ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా తాము ఐదు కోట్ల డోసులను ఉత్పత్తి చేయగలమని ఈ కంపెనీలు భావిస్తున్నాయి. 2021లో 130 కోట్ల డోసులను ఉత్పత్తి చేయాలని ఆశిస్తున్నట్టు ఫైజర్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ టీకా ట్రయల్స్ జులై 27న ప్రారంభమవ్వగా, ఇప్పటి వరకు 43,538 మంది వాలంటీర్లను రిక్రూట్ చేసుకుంది. నవంబర్ 8వ తేదీ నాటికి 38,955 మంది రెండో డోసు తీసుకున్నారు. మూడో దశ ట్రయల్స్ ఇంకా పూర్తి కావాల్సి ఉన్నది. ఉన్నత నిపుణుల సమీక్ష కోసం ట్రయల్స్ డేటాను సమర్పించడానికి కంపెనీలు ప్లాన్ చేస్తున్నాయి.