మళ్లీ హెచ్1 బీ వీసాలపై వేటు?
వాషింగ్టన్: కరోనా వైరస్ కారణంగా అమెరికాలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్యను అధిగమించేందుకు అమెరికా ప్రభుత్వం హెచ్-1బీ వీసాలపై వేటు వేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తున్నది. అమెరికా కంపెనీలు హెచ్-1బీ వీసా ద్వారా నిపుణులైన విదేశీయులను పనిలోకి తీసుకుంటుంది. భారత్ నుంచి చాలా మంది ఐటీ నిపుణులు, ఉద్యోగులు ఈ వీసాలపైనే యూఎస్ వెళ్తుంటారు. హెచ్-1బీ వీసాతోపాటు షార్ట్ టైమ్ వర్కర్ల కోసం వినియోగించే హెచ్2బీ సహా జే-1, ఎల్-1 వీసాలనూ సస్పెండ్ చేయనున్నట్టు వాల్‌స్ట్రీట్ జర్నల్ ఓ కథనాన్ని […]
వాషింగ్టన్: కరోనా వైరస్ కారణంగా అమెరికాలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్యను అధిగమించేందుకు అమెరికా ప్రభుత్వం హెచ్-1బీ వీసాలపై వేటు వేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తున్నది. అమెరికా కంపెనీలు హెచ్-1బీ వీసా ద్వారా నిపుణులైన విదేశీయులను పనిలోకి తీసుకుంటుంది. భారత్ నుంచి చాలా మంది ఐటీ నిపుణులు, ఉద్యోగులు ఈ వీసాలపైనే యూఎస్ వెళ్తుంటారు. హెచ్-1బీ వీసాతోపాటు షార్ట్ టైమ్ వర్కర్ల కోసం వినియోగించే హెచ్2బీ సహా జే-1, ఎల్-1 వీసాలనూ సస్పెండ్ చేయనున్నట్టు వాల్‌స్ట్రీట్ జర్నల్ ఓ కథనాన్ని వెలువరించింది. మహమ్మారి కారణంగా ఆ దేశంలో నిరుద్యోగం పెరగడంతో అమెరికావాసులకే ఉపాధి లభించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. సాధారణంగా ఆర్థిక సంవత్సరం మొదట్లో ఈ వీసాలకు పెద్దమొత్తంలో అనుమతులు లభిస్తుంటాయి. ఈ నేపథ్యంలో విదేశీ ఉద్యోగులకు ఉద్దేశించిన వీసాలపై వేటు నిర్ణయాన్ని కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న అక్టోబర్ 1 నుంచి ఈ నిబంధనలు అమలయ్యే అవకాశమున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే ఈ వీసాల కింద పనిచేస్తున్నవారికి ఈ ముప్పు ఉండబోదని, ఈ వీసాల కోసం ఎదురుచూస్తున్నవారిపైనే ఈ నిర్ణయం ప్రభావం ఉంటుందని సదరు పత్రిక పేర్కొంది. అయితే, ఈ నిర్ణయం ఇంకా ఖరారు కాలేదని, అనేకాంశాలపై సమాలోచనలు జరుగుతున్నాయని వైట్ హౌజ్ తెలిపింది.