ఆ ప్రాంతంలో అంబులెన్స్ సైరన్ మోగుతుందా ?

దిశ, కల్లూరు : ఆ ప్రాంతంలో 108 అత్యవసర సేవలకు మోక్షం కలుగుతుందా అనే అనుమానం కలుగుతోంది. ఖమ్మం జిల్లా కల్లూరు రెవెన్యూ డివిజన్ కేంద్రంలో గత నాలుగు నెలలుగా 108 వాహనం అందుబాటులో లేక ఎంతో మంది ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఆదివారం రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో కల్లూరు  ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఒక వ్యక్తి టూవీలర్ పై వస్తుండగా చిన్న రోడ్డు ప్రమాదం జరిగిన సంఘటన చోటు చేసుకుంది. ప్రాణాపాయ స్థితిలో […]

Update: 2021-12-27 04:26 GMT

దిశ, కల్లూరు : ఆ ప్రాంతంలో 108 అత్యవసర సేవలకు మోక్షం కలుగుతుందా అనే అనుమానం కలుగుతోంది. ఖమ్మం జిల్లా కల్లూరు రెవెన్యూ డివిజన్ కేంద్రంలో గత నాలుగు నెలలుగా 108 వాహనం అందుబాటులో లేక ఎంతో మంది ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఆదివారం రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఒక వ్యక్తి టూవీలర్ పై వస్తుండగా చిన్న రోడ్డు ప్రమాదం జరిగిన సంఘటన చోటు చేసుకుంది.

ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో కొంతమంది యువకులు అక్కడికి చేరుకొని అతని ప్రాణాలు కాపాడేందుకు వాహనాలు ఆపే ప్రయత్నం చేయగా ఎటువంటి అవకాశం లేకపోవడంతో వారి స్నేహితుల కారు సహాయంతో ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది. ఇంత దయనీయ పరిస్థితి కల్లూరు రెవెన్యూ డివిజన్ కేంద్రంలో చోటు చేసుకోవడంతో అక్కడున్న యువకులు, చూసిన వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 108 సదుపాయం ఉన్నట్లయితే ప్రమాదం జరిగిన వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి అవకాశం ఉండేదన్నారు. ప్రమాదం జరిగితే ఇలా ఇబ్బంది పడవలసిందేనా అంటూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్రికలు ఘోష ,ప్రజల ఆర్తనాదాలు, ఎవరికి వినిపించకపోవడంతో మండలంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఎవరి లోపం ఎవరికి శాపం

ఇప్పటికైనా కల్లూరు రెవెన్యూ డివిజన్ కేంద్రమైన కల్లూరులో వెంటనే 108 వాహనము ఏర్పాటు చేయాలని అధికారులను వేడుకుంటున్నారు.

Tags:    

Similar News