అమెజాన్ స్మాల్ బిజినెస్ డేస్‌తో 84 వేల మందికి ప్రయోజనాలు!
దిశ, వెబ్‌డెస్క్: అమెజాన్ ఇండియా ఇటీవల నిర్వహించిన స్మాల్ బిజినెస్ డేస్(ఎస్‌బీడీ) ద్వారా కొవిడ్ సెకెండ్ వేవ్ వల్ల నష్టపోయిన 84 వేల మంది చిన్న, మధ్య తరహా వ్యాపారుల(ఎస్ఎంబీ)కు సహాయపడినట్టు కంపెనీ ఆదివారం తెలిపింది. ఈ నెల జూలై 2-4 మధ్య ఈ కార్యక్రమం జరిగింది. మొత్తం వ్యాపారుల్లో 68 శాతం మంది మెట్రోయేతర నగరాల వారున్నారని, 7,500 మంది అమ్మకందారులు అత్యధిక సింగిల్-డే అమ్మకాలను సాధించారని, ఇది గతేడాది డిసెంబర్‌లో జరిగిన దాంతో పోలిస్తే […]
దిశ, వెబ్‌డెస్క్: అమెజాన్ ఇండియా ఇటీవల నిర్వహించిన స్మాల్ బిజినెస్ డేస్(ఎస్‌బీడీ) ద్వారా కొవిడ్ సెకెండ్ వేవ్ వల్ల నష్టపోయిన 84 వేల మంది చిన్న, మధ్య తరహా వ్యాపారుల(ఎస్ఎంబీ)కు సహాయపడినట్టు కంపెనీ ఆదివారం తెలిపింది. ఈ నెల జూలై 2-4 మధ్య ఈ కార్యక్రమం జరిగింది. మొత్తం వ్యాపారుల్లో 68 శాతం మంది మెట్రోయేతర నగరాల వారున్నారని, 7,500 మంది అమ్మకందారులు అత్యధిక సింగిల్-డే అమ్మకాలను సాధించారని, ఇది గతేడాది డిసెంబర్‌లో జరిగిన దాంతో పోలిస్తే 2.8 రెట్లు ఎక్కువని అమెజాన్ ఓ ప్రకటనలో తెలిపింది.
రూ. కోటికి పైగా వ్యాపారాలను సాధించిన వారు ఆరు రెట్లు పెరిగారని, ముఖ్యంగా ఈ స్మాల్ బిజినెస్ డేస్‌లో వేలాది స్థానిక దుకాణదారులు పాల్గొన్నారని, వీటిలో 1,700 మంది 125 నగరాలకు చెందినవారున్నట్టు కంపెనీ వివరించింది. ‘కొవిడ్ సెకెండ్ వేవ్ ప్రభావానికి గురైన చిన్న వ్యాపారులు, చేతివృత్తుల వారు, నేత కార్మికులు, మహిళా పారిశ్రామికవేత్తలు, చిన్న చిన్న స్థానిక ఆఫ్‌లైన్ దుకాణాల వారిని తిరిగి పుంజుకునేందుకు ప్రాధాన్యత ఇచ్చామని’ అమెజాన్ ఇండియా ఎంఎస్ఎంఈ అండ్ విక్ర భాగస్వామయ సీనియర్ డైరెక్టర్ ప్రణవ్ భాసిన్ చెప్పారు.