అమెజాన్ ప్రైమ్‌లో క్రికెట్ మ్యాచులు!
దిశ, స్పోర్ట్స్ : ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ క్రికెట్ ప్రత్యక్ష ప్రసారాల్లోకి అడుగుపెట్టనుంది. న్యూజిలాండ్ క్రికెట్‌కు సంబంధించిన హక్కులను అమెజాన్ కొనుగోలు చేసింది. 2021 నుంచి 2026 వరకు న్యూజిలాండ్ పురుషుల, మహిళలకు చెందిన మ్యాచ్‌లను ఇండియాలో ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ‘గత కొంత కాలంగా ప్రైమ్ వీడియో ఇండియాలో అతిపెద్ద ఎంటర్టైన్మెంట్ ప్లాట్‌ఫామ్‌గా ఉన్నది. పలు భాషల కొత్త చిత్రాలతో పాటు వెబ్ సిరీస్‌లను కూడా ప్రసారం చేస్తున్నాము. ఇప్పుడు […]
దిశ, స్పోర్ట్స్ : ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ క్రికెట్ ప్రత్యక్ష ప్రసారాల్లోకి అడుగుపెట్టనుంది. న్యూజిలాండ్ క్రికెట్‌కు సంబంధించిన హక్కులను అమెజాన్ కొనుగోలు చేసింది. 2021 నుంచి 2026 వరకు న్యూజిలాండ్ పురుషుల, మహిళలకు చెందిన మ్యాచ్‌లను ఇండియాలో ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది.
‘గత కొంత కాలంగా ప్రైమ్ వీడియో ఇండియాలో అతిపెద్ద ఎంటర్టైన్మెంట్ ప్లాట్‌ఫామ్‌గా ఉన్నది. పలు భాషల కొత్త చిత్రాలతో పాటు వెబ్ సిరీస్‌లను కూడా ప్రసారం చేస్తున్నాము. ఇప్పుడు క్రికెట్ ప్రసారాలు కూడా చేయడం సంతోషంగా ఉంది. ప్రైమ్‌లో లైవ్ ప్రసారాలు చేయడం ఇండియా నుంచే మొదలు పెట్టడం గర్వకారణంగా ఉంది’ అని ప్రైమ్ వీడియో కంట్రీ జనరల్ మేనేజర్ గౌరవ్ గాంధీ అన్నారు.