అమెజాన్‌లో కొత్తగా 50 వేల ఉద్యోగాలు
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 సంక్షోభం, లాక్‌డౌన్ కారణాలతో అనేక కంపెనీలు ఉద్యోగుల తొలగింపు, వేతనాల్లో కోత విధించడం లాంటి నిర్ణయాలు తీసుకుంటున్న తరుణంలో ఆన్‌లైన్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మాత్రం తమకు మరింత సిబ్బంది కావాలని వెల్లడించింది. ప్రస్తుతం డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో 50 వేల మందిని నియమించుకోవడానికి ప్రయత్నిస్తున్నామని అమెజాన్ ఇండియా ప్రకటించింది. అమెజాన్‌లో స్వతంత్ర కాంట్రాక్టర్లుగా, పార్ట్‌టైమ్ ఉద్యోగాల విభాగంలో వీరిని తీసుకుంటామని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న అమెజాన్ కేంద్రాలు, డెలివరీ నెట్‌వర్క్‌లలో ఈ […]
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 సంక్షోభం, లాక్‌డౌన్ కారణాలతో అనేక కంపెనీలు ఉద్యోగుల తొలగింపు, వేతనాల్లో కోత విధించడం లాంటి నిర్ణయాలు తీసుకుంటున్న తరుణంలో ఆన్‌లైన్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మాత్రం తమకు మరింత సిబ్బంది కావాలని వెల్లడించింది. ప్రస్తుతం డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో 50 వేల మందిని నియమించుకోవడానికి ప్రయత్నిస్తున్నామని అమెజాన్ ఇండియా ప్రకటించింది. అమెజాన్‌లో స్వతంత్ర కాంట్రాక్టర్లుగా, పార్ట్‌టైమ్ ఉద్యోగాల విభాగంలో వీరిని తీసుకుంటామని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న అమెజాన్ కేంద్రాలు, డెలివరీ నెట్‌వర్క్‌లలో ఈ అవకాశాలుంటాయని తెలిపింది. కరోనా వ్యాప్తి కొనసాగుతున్న ఈ సమయంలో వీలైనంత ఎక్కువ మందికి సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించేలా చూస్తున్నామని అమెజాన్ వైస్ ప్రెసిడెంట్ అఖిల్ సక్సేనా ఒక ప్రకటనలో వివరించారు.