అమెజాన్ ఇయర్-ఎండ్ సేల్.. ఈ ఫోన్లపై భారీ తగ్గింపు
దిశ, వెబ్‌డెస్క్: 2021 ముగుస్తున్న తరుణంలో ఈ-కామర్స్ సంస్థలు కస్టమర్స్‌ని ఆకర్షించడానికి కొత్త కొత్త ఆఫర్స్ ఇస్తున్నాయి. అందులో భాగంగా దిగ్గజ ఆన్‌లైన్ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ అనేక ఆఫర్‌లను అందిస్తోంది. ప్రముఖ టెలివిజన్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు వంటి అనేక టాప్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై అమెజాన్ తన సంవత్సరపు చివరి విక్రయాన్ని ప్రారంభించింది. ఇయర్-ఎండ్ సేల్ 2021 సందర్భంగా ఫోన్‌లు, టీవీలు ఇతర ఎలక్ట్రానిక్స్‌పై మంచి డీల్‌లు, తగ్గింపులు, ఆఫర్‌లను అందిస్తోంది. బ్యాంక్ డిస్కౌంట్లు, నో-కాస్ట్ EMI వంటి […]
దిశ, వెబ్‌డెస్క్: 2021 ముగుస్తున్న తరుణంలో ఈ-కామర్స్ సంస్థలు కస్టమర్స్‌ని ఆకర్షించడానికి కొత్త కొత్త ఆఫర్స్ ఇస్తున్నాయి. అందులో భాగంగా దిగ్గజ ఆన్‌లైన్ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ అనేక ఆఫర్‌లను అందిస్తోంది. ప్రముఖ టెలివిజన్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు వంటి అనేక టాప్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై అమెజాన్ తన సంవత్సరపు చివరి విక్రయాన్ని ప్రారంభించింది. ఇయర్-ఎండ్ సేల్ 2021 సందర్భంగా ఫోన్‌లు, టీవీలు ఇతర ఎలక్ట్రానిక్స్‌పై మంచి డీల్‌లు, తగ్గింపులు, ఆఫర్‌లను అందిస్తోంది. బ్యాంక్ డిస్కౌంట్లు, నో-కాస్ట్ EMI వంటి సదుపాయాలను అందిస్తోంది. అమెజాన్ ఇయర్-ఎండ్ సేల్ 2021లో అందించే ఆఫర్స్..
Xiaomi 11 Lite NE 5G- అమెజాన్‌లో ఇయర్-ఎండ్ సేల్‌లో భాగంగా కస్టమర్లు ఈ ఫోన్‌ను రూ.24,500కి పొందవచ్చు. ICICI బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌లతో రూ.2500 అదనపు తగ్గింపు కూడా పొందవచ్చు. పాత ఫోన్‌ని ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా, ఈ ఫోన్‌ను రూ.19,950 వద్ద పొందవచ్చు.
Samsung Galaxy M52 5G- అమెజాన్ Samsung Galaxy M52 5G Blazing Black, 6GB RAM, 128GB వేరియంట్‌ను రూ.29,000కి అందిస్తోంది. ఎక్స్‌ట్రాగా రూ.2500 తగ్గింపు. అమెజాన్ సేల్‌లో భాగంగా ఈ ఫోన్‌ను ICICI క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే EMI రూ.1,412 నుండి, ఫ్లాట్ రూ.3000తో ప్రారంభమవుతుంది.
OnePlus Nord CE 5G- ఈ ఫోన్ రూ. 24,999కి లభిస్తుంది. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించే కస్టమర్‌లు రూ. 1,500 అదనపు తగ్గింపు పొందవచ్చు. కస్టమర్లు రూ.13,950 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను పొందవచ్చు.
OnePlus Nord 2 5G (8GB)- అమెజాన్ ఇయర్-ఎండ్ సేల్ 2021 సందర్భంగా ఈ ఫోన్ రూ. 29,999కి విక్రయించబడుతోంది. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉన్న కస్టమర్‌లకు అదనంగా రూ.2000 ఫ్లాట్ తగ్గింపు ఉంది. పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ ద్వారా రూ.16,950 వరకు అదనపు తగ్గింపును పొందవచ్చు.
Redmi Note 10S- Amazon ఈ ఫోన్‌ను 2021 చివరి రోజుట్లో రూ.14,999 ధరకు విక్రయిస్తోంది. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై రూ.1000 తక్షణ తగ్గింపు కూడా అందుబాటులో ఉంది. మరిన్ని అదనపు తగ్గింపుల కోసం, కస్టమర్లు రూ. 13,950 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను పొందవచ్చు.