మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లు కల్పితమే : అమరావతి జేఏసీ

దిశ, ఏపీ బ్యూరో: మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లుపై అమరావతి జేఏసీ ఘాటుగా స్పందించింది. ఇది మరోకొత్త ఎత్తుగడే తప్ప మరేమీ కాదని అభిప్రాయపడింది. ప్రజలను మభ్యపెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని అమరావతి జేఏసీ నేతలు ప్రకటించారు. ఇది కేవలం అమరావతి ప్రాంత ప్రజలకే కాదని యావత్ రాష్ట్రానికి ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందని ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. మరోవైపు రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. వరదలతో తీవ్రంగా నష్టపోయిన జిల్లాలకు అమరావతి జేఏసీ తమవంతు […]

Update: 2021-11-22 11:59 GMT

దిశ, ఏపీ బ్యూరో: మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లుపై అమరావతి జేఏసీ ఘాటుగా స్పందించింది. ఇది మరోకొత్త ఎత్తుగడే తప్ప మరేమీ కాదని అభిప్రాయపడింది. ప్రజలను మభ్యపెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని అమరావతి జేఏసీ నేతలు ప్రకటించారు. ఇది కేవలం అమరావతి ప్రాంత ప్రజలకే కాదని యావత్ రాష్ట్రానికి ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందని ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. మరోవైపు రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. వరదలతో తీవ్రంగా నష్టపోయిన జిల్లాలకు అమరావతి జేఏసీ తమవంతు సహాయాన్ని ప్రకటించాయి.

వరదధాటికి తీవ్రంగా నష్టపోయిన చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలకు ఒక్కో జిల్లాకు రూ.5లక్షలు చొప్పున మెుత్తం రూ.15 లక్షలు ఆర్థిక సహాయం చేస్తున్నట్లు అమరావతి జేఏసీ నేతలు ప్రకటించారు. ఇకపోతే ఏపీకి ఏకైక రాజధాని ఉండాలని.. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రైతులు, మహిళలు న్యాయస్థానంటూ దేవస్థానం పేరుతో మహాపాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్ర గుంటూరు, ప్రకాశం జిల్లాల మీదుగా నెల్లూరు చేరుకుంది. ప్రస్తుతం నెల్లూరులో పాదయాత్ర కొనసాగుతుంది. నేడు కొండబిట్రగుంట దగ్గర నుంచి పాదయాత్ర మెుదలై సున్నంబట్టి వరకు అంటే 15 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగనుంది.

Tags:    

Similar News