బాధితులకు రూ. 25 లక్షలు ఇవ్వండి.. ఏలేటి సంచలన డిమాండ్
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఇంటర్ విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట విద్యార్థి పోరు దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా కష్ట కాలంలో ప్రత్యక్ష బోధన నిలిపివేసిన సమయంలో ఆన్‌లైన్ క్లాసులు వినడానికి పేద విద్యార్థులు సరైన సదుపాయాలు, కనీసం కుటుంబంలో స్మార్ట్ ఫోన్ లేక చదువుకోలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి […]
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఇంటర్ విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట విద్యార్థి పోరు దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా కష్ట కాలంలో ప్రత్యక్ష బోధన నిలిపివేసిన సమయంలో ఆన్‌లైన్ క్లాసులు వినడానికి పేద విద్యార్థులు సరైన సదుపాయాలు, కనీసం కుటుంబంలో స్మార్ట్ ఫోన్ లేక చదువుకోలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి సమయంలో ప్రభుత్వం విద్యార్థులకు సరైన సదుపాయాలు కల్పించకుండా పరీక్ష నిర్వహించడంతో చాలా మంది విద్యార్థులు నష్టపోవాల్సి వచ్చిందని అభిప్రాయపడ్డారు.
ఈ సమస్యలను పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం విద్యార్థుల చావులకు కారణమైందని ఆరోపించారు. విద్యావిధానం పై ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదని.. ప్రభుత్వ అనాలోచిత చర్యలతోనే విద్యార్థులు నష్టపోయారని అన్నారు. ఇప్పుడు మరో వైరస్ ఒమిక్రాన్ నేపథ్యంలో ఇకనైన పేద విద్యార్థులకు ముందుచూపుతో ట్యాబ్‌లు, స్మార్ట్ ఫోన్లు అందించాలని సూచించారు. అలాగే చనిపోయిన విద్యార్థి కుటుంబాలకు రూ. 25 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.