ప్రభుత్వ యూనివర్శిటీల విధ్వంసానికి కుట్ర !

దిశ, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన యూనివర్శిటీలను విధ్వంసం చేసేందుకే సీఎం కేసీఆర్ ప్రైవేటు విశ్వవిద్యాలయాలను స్థాపిస్తున్నారని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆరోపించింది. ఈ మేరకు కమిటీ ఛైర్మన్ ప్రొ. చక్రధర‌రావు, కన్వీనర్లు ప్రొ. హరగోపాల్, ప్రొ.కె. లక్ష్మీనారాయణ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రైవేటు వర్శిటీలను టీఆర్ఎస్ నేతలు స్థాపించడం సిగ్గు చేటని విమర్శించారు. కరోనా సంక్షోభాన్ని అదునుగా భావించిన ప్రధాని మోడీ కార్మిక వర్గాన్ని దెబ్బకొట్టినట్టే, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వ వర్శిటీల విధ్వంసానికి […]

Update: 2020-05-21 09:39 GMT

దిశ, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన యూనివర్శిటీలను విధ్వంసం చేసేందుకే సీఎం కేసీఆర్ ప్రైవేటు విశ్వవిద్యాలయాలను స్థాపిస్తున్నారని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆరోపించింది. ఈ మేరకు కమిటీ ఛైర్మన్ ప్రొ. చక్రధర‌రావు, కన్వీనర్లు ప్రొ. హరగోపాల్, ప్రొ.కె. లక్ష్మీనారాయణ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రైవేటు వర్శిటీలను టీఆర్ఎస్ నేతలు స్థాపించడం సిగ్గు చేటని విమర్శించారు. కరోనా సంక్షోభాన్ని అదునుగా భావించిన ప్రధాని మోడీ కార్మిక వర్గాన్ని దెబ్బకొట్టినట్టే, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వ వర్శిటీల విధ్వంసానికి ఒడిగట్టారని దుయ్యబట్టారు. మంత్రి మల్లారెడ్డి, రైతుబంధు అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌‌రెడ్డిలు వర్శిటీలు స్థాపించడాన్నిగర్హిస్తున్నట్లు పేర్కొన్నారు. ఓయూ, కాకతీయ వర్శిటీలను బలహీనపర్చి, మూసివేయాలనే కుట్రతోనే వీటికి సమీపంలో ప్రైవేటు యూనివర్శిటీలను ఏర్పాటు చేస్తున్నారని ధ్వజమెత్తారు..

Tags:    

Similar News