డీజీపీపై ఆరోపణలు సరికాదు :వెల్లంపల్లి
దిశ, ఏపీ బ్యూరో : ఆలయాల్లో దాడుల కేసుల్లో టీడీపీ, బీజేపీ నేతల ప్రమేయాన్ని బయటపెట్టిన డీజీపీ గౌతం సవాంగ్‌పై ఆరోపణలు చేయడం సరికాదని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విపక్షాలకు హితవు పలికారు. ఆదివారం విజయవాడలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ తిరుపతి ఉప ఎన్నికలో లబ్ధి పొందేందుకే టీడీపీ, బీజేపీ, జనసేన ఇలాంటి కుట్రలు పాల్పడుతున్నట్లు చెప్పారు. నిజాలను నిగ్గు తేల్చినందుకు డీజీపీ రాజీనామా చేయాలా అని మంత్రి ప్రశ్నించారు. డీజీపీని చంద్రబాబు, సోము […]
దిశ, ఏపీ బ్యూరో : ఆలయాల్లో దాడుల కేసుల్లో టీడీపీ, బీజేపీ నేతల ప్రమేయాన్ని బయటపెట్టిన డీజీపీ గౌతం సవాంగ్‌పై ఆరోపణలు చేయడం సరికాదని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విపక్షాలకు హితవు పలికారు. ఆదివారం విజయవాడలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ తిరుపతి ఉప ఎన్నికలో లబ్ధి పొందేందుకే టీడీపీ, బీజేపీ, జనసేన ఇలాంటి కుట్రలు పాల్పడుతున్నట్లు చెప్పారు. నిజాలను నిగ్గు తేల్చినందుకు డీజీపీ రాజీనామా చేయాలా అని మంత్రి ప్రశ్నించారు. డీజీపీని చంద్రబాబు, సోము వీర్రాజు టార్గెట్ చేయడాన్ని తప్పుబట్టారు. అసలు చంద్రబాబుకు హిందువుల గురించి మాట్లాడే నైతిక అర్హత ఉందా అని దుయ్యబట్టారు. దేవుడి దగ్గర బూట్లు వేసుకొని పూజలు చేసే చంద్రబాబుకు అసలు దేవుడి పట్ల భక్తి ఉందా అని నిలదీశారు. కులమతాలకతీతంగా మానవత్వమే సీఎం జగన్ అభిమతమని మంత్రి వెల్లంపల్లి పేర్కొన్నారు.