లెక్కలు దాచాల్సిన అవసరం ఏముంది?: ఆళ్ల నాని
కరోనా వైరస్ బారిన పడ్డ వారి లెక్కలను దాచాల్సిన అవసరం ఏముందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ప్రశ్నిచారు. ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హైదరాబాదులో కూర్చుని‘కరోనా’లెక్కలు దాస్తున్నామని చెప్పడం ఘనకార్యం కాదని, క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలిస్తే నిజానిజాలు తెలుస్తాయని సూచించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థ ద్వారా రాష్ట్ర నలుమూలల నుంచి సమాచారం సేకరిస్తున్నామని ఆయన చెప్పారు. విదేశాల […]
కరోనా వైరస్ బారిన పడ్డ వారి లెక్కలను దాచాల్సిన అవసరం ఏముందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ప్రశ్నిచారు. ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హైదరాబాదులో కూర్చుని‘కరోనా’లెక్కలు దాస్తున్నామని చెప్పడం ఘనకార్యం కాదని, క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలిస్తే నిజానిజాలు తెలుస్తాయని సూచించారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థ ద్వారా రాష్ట్ర నలుమూలల నుంచి సమాచారం సేకరిస్తున్నామని ఆయన చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన 28,622 మందిని గుర్తించామని, వీరిలో 15 మందికి పాజిటివ్ గా వచ్చిందని ఆయన వెల్లడించారు. మిగిలిన వారిని నిర్బంధ పర్యవేక్షణలో ఉంచామని, 14 రోజుల హోం క్వారంటైన్ పూర్తి కావచ్చిందని, వారికి కరోనా లక్షనాలు ఉంటే బయటపడేవి అని, అయినప్పటికీ వారిని నిర్బంధ పర్యవేక్షణలోనే ఉంచామని ఆయన తెలిపారు.
ఢిల్లీలోని తబ్లిఘీ జమాత్ మర్కజ్‌కి వెళ్లొచ్చి వారిలో 196 మంది కరోనా బారిన పడ్డారని ఆయన చెప్పారు. వారందర్నీ ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నామని ఆయన తెలిపారు. ఏపీలో సుమారు 6175 మంది హోం క్వారంటైన్‌లో ఉంచామని ఆయన వెల్లడించారు. వారందరిపై నిఘా సాగుతోందని ఆయన అన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా అసత్య ప్రచారాలతో లబ్ది పొందాలని చూడవద్దని టీడీపీ అధినేతకు ఆయన హితవు పలికారు.
Tags: andhra pradesh, vijayawada, r&b guest house, alla nani, health minister