‘కాసేపట్లో అఖిలపక్ష సమావేశం.. తమను ఎందుకు ఆహ్వానించలేదు’

ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో శుక్రవారం ఇండియా, చైనా సరిహద్దు వివాదంపై దేశంలోని అన్ని పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్న విషయం తెలిసిందే. దేశంలో మొదటిసారిగా అఖిలపక్ష సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగనుంది. ఈ అఖిలపక్ష భేటీలో సోనియా గాంధీ, మమతా బెనర్జీలు సహా దేశంలో పలు పార్టీ కీలక నేతలు పాల్గొననున్నారు. ఈ సమావేశానికి దేశంలోని దాదాపు 20 పార్టీలకు ఆహ్వానం పంపగా.. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి, బీహార్‌లో అధికారంలో […]

Update: 2020-06-19 05:46 GMT

ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో శుక్రవారం ఇండియా, చైనా సరిహద్దు వివాదంపై దేశంలోని అన్ని పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్న విషయం తెలిసిందే. దేశంలో మొదటిసారిగా అఖిలపక్ష సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగనుంది. ఈ అఖిలపక్ష భేటీలో సోనియా గాంధీ, మమతా బెనర్జీలు సహా దేశంలో పలు పార్టీ కీలక నేతలు పాల్గొననున్నారు. ఈ సమావేశానికి దేశంలోని దాదాపు 20 పార్టీలకు ఆహ్వానం పంపగా.. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి, బీహార్‌లో అధికారంలో ఉన్న ఆర్జేడీ పార్టీకి ఆహ్వానం పంపించలేదు. దీంతో తమను సమావేశానికి ఎందుకు ఆహ్వానించలేదని ట్విట్టర్‌లో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కేంద్రాన్ని ప్రశ్నించారు. కాగా ఇండియా, చైనా సరిహద్దు వివాదంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరును కాంగ్రెస్ తప్పుబట్టిన విషయం తెలిసిందే. అసలు సరిహద్దులో ఏం జరిగందో దేశ ప్రజలకు చెప్పాలని రాహుల్ గాంధీ సైతం ప్రభుత్వాన్ని ప్రశ్నించిన విషయమూ తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఘర్షణపై అన్ని పార్టీలకు ప్రధాని నరేంద్ర మోడీ వివరణ ఇవ్వనున్నారు.

Tags:    

Similar News