అవన్నీ పుకార్లే : ఏసీపీ ఉమేందర్

దిశ, కరీంనగర్: ఎల్లంపల్లి ప్రాజెక్టు సమీప గ్రామల్లో వ్యర్థాలను వేసి చేపలను పెంచుతున్నారని సోషల్ మీడియాలో వస్తున్నవన్నీ పుకార్లేనని గోదావరిఖణి ఏసీపీ ఉమేందర్ స్పష్టం చేశారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా అంతర్గాం పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాల్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ ప్రాంతంలో కోళ్ల వ్యర్థ పదార్థాలతో చేపలను పెంచడం లేదని గుర్తించామని తెలిపారు. చేపల చెరువుల యజమానులతో మాట్లాడుతూ.. చేపలు తొందరగా వృద్ధి చెందుతాయని అధిక దిగుబడి వస్తుందని కోళ్లవ్యర్థ పదార్థాలను ఆహారంగా […]

Update: 2020-06-30 03:52 GMT

దిశ, కరీంనగర్: ఎల్లంపల్లి ప్రాజెక్టు సమీప గ్రామల్లో వ్యర్థాలను వేసి చేపలను పెంచుతున్నారని సోషల్ మీడియాలో వస్తున్నవన్నీ పుకార్లేనని గోదావరిఖణి ఏసీపీ ఉమేందర్ స్పష్టం చేశారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా అంతర్గాం పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాల్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ ప్రాంతంలో కోళ్ల వ్యర్థ పదార్థాలతో చేపలను పెంచడం లేదని గుర్తించామని తెలిపారు. చేపల చెరువుల యజమానులతో మాట్లాడుతూ.. చేపలు తొందరగా వృద్ధి చెందుతాయని అధిక దిగుబడి వస్తుందని కోళ్లవ్యర్థ పదార్థాలను ఆహారంగా వేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏసీపీ స్పష్టం చేశారు. అసత్య ప్రచారం చేస్తున్న వారిపై కూడా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఏసీపీ తెలిపారు.

Tags:    

Similar News