గుడిబండ.. ఇప్పుడు తొక్కుడుబండ

దిశ, మహబూబ్ నగర్: మొత్తం మీద ఇప్పుడు తెర మీదకు వచ్చింది. దీంతో ఆ పేరు మారుమోగుతోంది. ఇగేముందీ.. ఇక అందరూ ఆ వైపే దృష్టి సారిస్తున్నారు. ఇప్పుడది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది. దీంతో అక్కడ ఎప్పుడు చూసినా కిటకిటే. అదేంటో మీరే చూడండి.. గుడిబండ నిన్నటి వరకూ ఎవ్వరికీ పెద్దగా తెలియని పేరు. కానీ, ఇప్పుడది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాతోపాటు వివిధ ప్రాంతాల వారి నోట్లో నానుతున్నతీరే వేరు. అటు రియల్టర్లు… ఇటు […]

Update: 2020-03-16 04:24 GMT

దిశ, మహబూబ్ నగర్: మొత్తం మీద ఇప్పుడు తెర మీదకు వచ్చింది. దీంతో ఆ పేరు మారుమోగుతోంది. ఇగేముందీ.. ఇక అందరూ ఆ వైపే దృష్టి సారిస్తున్నారు. ఇప్పుడది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది. దీంతో అక్కడ ఎప్పుడు చూసినా కిటకిటే. అదేంటో మీరే చూడండి..

గుడిబండ నిన్నటి వరకూ ఎవ్వరికీ పెద్దగా తెలియని పేరు. కానీ, ఇప్పుడది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాతోపాటు వివిధ ప్రాంతాల వారి నోట్లో నానుతున్నతీరే వేరు. అటు రియల్టర్లు… ఇటు పెట్టుబడిదారులు ఇలా చాలామంది గుదిబండకు క్యూ కడుతున్నారు. కారణమేమిటంటే.. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే 6 విమానాశ్రయాలలో గుడిబండ కూడా ఒకటి. అయితే ఇందుకు సంబంధించి మహబూబ్ నగర్ జిల్లాలోని గుడిబండ గ్రామంలో విమానాశ్రయం ఏర్పాటుకు కావాల్సిన స్థలాన్ని కూడా గతంలోనే అధికారులు గుర్తించారు. దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకుల మండలంలో ఉన్న ఈ గుడిబండలో ఎయిర్‌పోర్టును ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలాన్ని గతంలోనే అధికారులు గుర్తించారు. దానికి అనుగూణంగా ఈ గ్రామ పరిసరాల్లో సుమారు 200 ఎకరాల భూమిని గుర్తించి నివేదికలు తయారు చేశారు. గతంలోనే ఈ ప్రాంతాన్ని ఏవియేషన్ అధికారులు సందర్శించారు. ఆ సమయంలో ఇక్కడ రెండు చోట్ల ఉన్న హైటెన్షన్ విద్యుత్ లైన్లను తొలగిస్తే ఇక్కడ విమానాశ్రయం ఏర్పాటుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని నివేదించారు. అదే సమయంలో ఇదే నియోజకవర్గంలోని చౌదర్ పల్లి, బస్వాయిపల్లి, హజిల్లాపూర్ గ్రామాలలోని భూములను కూడా అధికారులు పరిశీలించారు. అయితే గుడిబండ వైపు వారు ఎక్కువగా మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. పైగా ఈ ప్రాంతంలో ప్రభుత్వ భూమి అధికంగా ఉండడం కూడా ఈ ప్రాంతానికి కలిసొచ్చే అంశమనే చెప్పాలి.

మరుగున పడి..

కొంతకాలంగా ఈ అంశం మరుగున పడిన నేపథ్యంలో కొంతవరకు ఈ ప్రాంతవాసులకు కూడా ఎయిర్‌పోర్టుపై ఆశలు సన్నగిల్లుతూ వచ్చాయి. కానీ, తాజాగా గత శుక్రవారం నాడు రాష్ర్ట ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అటు అసెంబ్లీతోపాటు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆప్ ఇండియా చైర్మన్ అరవింద్ సింగ్‌ను కలిసి వివరించారు. అనంతరం ఇందుకు సంబంధించి ప్రకటన చేశారు. అందులో గుడిబండ పేరు కూడా వుండడంతో ఈ ప్రాంతాల ప్రజల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. వెనుకబడి ఉన్న పాలమూరు జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు చేయనుండడంతో జిల్లా వాసులు కూడా ఆశలు భారీగానే పెంచుకున్నారు. ఎయిర్‌పోర్టు ఏర్పాటు వల్ల జిల్లాకు నూతన పెట్టుబడులు రావడంతోపాటు ఐటీ సంస్థలు కూడా జిల్లా వైపు మొగ్గుచూపే అవకాశాలు వున్నందున జిల్లాలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయనే ఆశలు జిల్లావాసుల్లో పెరుగుతున్నాయి. అదే సమయంలో రాష్ట్ర రాజధానికి కూడా జిల్లా అత్యంత సమీపంలో వుండడంతోపాటు జాతీయ రహదారికి అనుకుని ఈ విమానాశ్రయ ఏర్పాటు చేసే ప్రాంతం కూడా చేరువలో ఉండడం కలిసివచ్చే అంశంగా చెప్పాలి.

మొత్తం మీద..

మొత్తం మీద మరోమారు ఎయిర్‌పోర్టు అంశం తెరమీదకు రావడంతో రియల్టర్ల తాకిడి కూడా మొదలైంది. దీంతో ఈ ప్రాంతమంతా వాహనాల రాకపోకలతో కిటకిటలాడుతోంది. ముందుగానే అనువైన భూములను కొనుగోళ్ళు చేసుకునేందుకు వివిధ సంస్థల యాజమాన్యాలు ఈ ప్రాంతంపై దృష్టి సారిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం గుడిబండ గ్రామం సెంటర్ అఫ్ అట్రాక్షన్‌గా మారింది.

tags : mahabubnagar, gudibanda village, airport, ktr announced

Tags:    

Similar News