కరీంనగర్‌లో మాయం.. పెద్దపల్లిలో ప్రత్యక్ష్యం
దిశ, కరీంనగర్: కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల చోరీకి గురైన మద్యం పెద్దపల్లిలో ప్రత్యక్ష్యం అయింది. పెద్దపల్లి పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా అనుమానం వచ్చి ఇద్దరిని విచారించగా వేర్వేరు చోట్ల చోరీకి గురైన మద్యంతో పాటు వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. రామగుండం సీపీ సత్యనారాయణ వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా అప్పన్నపేట శివారులో పెద్దపల్లి సీఐ ప్రదీప్ కుమార్, బసంత నగర్ ఎస్సై జానీ పాషాలకు వచ్చిన కీలక సమాచారం మేరకు […]
దిశ, కరీంనగర్: కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల చోరీకి గురైన మద్యం పెద్దపల్లిలో ప్రత్యక్ష్యం అయింది. పెద్దపల్లి పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా అనుమానం వచ్చి ఇద్దరిని విచారించగా వేర్వేరు చోట్ల చోరీకి గురైన మద్యంతో పాటు వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. రామగుండం సీపీ సత్యనారాయణ వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా అప్పన్నపేట శివారులో పెద్దపల్లి సీఐ ప్రదీప్ కుమార్, బసంత నగర్ ఎస్సై జానీ పాషాలకు వచ్చిన కీలక సమాచారం మేరకు వాహనాల తనిఖీ చేపట్టారు. తనిఖీల్లో భాగంగా రెండు బైక్‌లను ఆపి రిజిస్ట్రేషన్ డాక్యూమెంట్ల గురించి ఆరా తీయగా పొంతనలేని సమాధానం చెప్తుండడంతో అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు వస్తున్న ట్రాలీని తనిఖీ చేయగా మద్యం బాక్సులు లభ్యం అయ్యాయి. దీంతో నిందితులిద్దరినీ విచారించగా వీరి గుట్టు రట్టయింది. ఈ కేసులో పెంచికల్‌పేటకు చెందిన మానుపాటి శేఖర్(32), రాజు(25), 8 ఇంక్లైన్ కాలనీకి చెందిన కుర్ర అంజయ్య, కాల్వ శ్రీరాంపూర్‌కు చెందిన పల్లెర్ల రమేష్(47)లను అరెస్ట్ చేశారు. ఈ ముఠాకు చెందిన పెంచికల్ పేట వాస సాగర్ల గణేష్(19) పరారీలో ఉన్నట్టు సీపీ సత్యనారాయణ తెలిపారు. నిందితుల నుంచి రెండు బైక్‌లు, రెండు అశోక్ లీల్యాండ్ ట్రాలీలు, బసంత్ నగర్ స్టేషన్ పరిధిలో చోరీ చేసిన రూ.3,66,800, కరీంనగర్ రూరల్ స్టేషన్ పరిధిలో దొంగలించిన రూ.1,23,600 విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని వివరించారు. నిందితుల నుంచి మొత్తం రూ. 13,60,400 విలువగల వాహనాలు, మద్యాన్ని పట్టుకున్నామని చెప్పారు. అనంతరం నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన పోలీసులను సీపీ అభినందించారు.