మద్యం, ఎల్జీ పాలిమర్స్ కేసులపై కోర్టులేమన్నాయంటే..!

దిశ, ఏపీ బ్యూరో: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి విధించిన లాక్‌డౌన్ ఆంక్షల నేపథ్యంలో మద్యం విక్రయాలు ప్రారంభించి, వైరస్ వ్యాప్తికి సహకరిస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. మద్యం అమ్మకాలు నిలిపేయాలంటూ మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లలో మద్యం అమ్మకాల సమయంలో భౌతికదూరం పాటించడం లేదని ఆరోపించగా, ప్రభుత్వం వాదనలు వినిపిస్తూ, నిబంధనలకు అనుగుణంగానే వైన్ షాపులకు అనుమతి ఇచ్చామని తెలిపింది. ఇరు పక్షాల వాదనలు విన్న […]

Update: 2020-05-19 06:32 GMT

దిశ, ఏపీ బ్యూరో: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి విధించిన లాక్‌డౌన్ ఆంక్షల నేపథ్యంలో మద్యం విక్రయాలు ప్రారంభించి, వైరస్ వ్యాప్తికి సహకరిస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. మద్యం అమ్మకాలు నిలిపేయాలంటూ మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లలో మద్యం అమ్మకాల సమయంలో భౌతికదూరం పాటించడం లేదని ఆరోపించగా, ప్రభుత్వం వాదనలు వినిపిస్తూ, నిబంధనలకు అనుగుణంగానే వైన్ షాపులకు అనుమతి ఇచ్చామని తెలిపింది. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు.. మద్యం అమ్మకాలపై సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. మరో కేసు వివరాల్లోకెళ్తే.. ఇటీవల విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి ప్రమాదకర స్టైరిన్ విషవాయువు లీకై 12 మంది మరణించిన ఘటనను ఏపీ హైకోర్టు సుమోటోగా స్వీకరించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ నిర్వహించి.. తదుపరి విచారణను ఈ నెల 20కి హైకోర్టు వాయిదా వేసింది. దీనిపై పూర్తి వివరాలందించాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించగా, కౌంటర్ దాఖలుకు మరికొంత సమయం కావాలని ప్రభుత్వం న్యాయస్థానాన్ని కోరింది.

మరోవైపు ఎల్జీ పాలిమర్స్ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ మొదలైంది. ఈ ఘటనపై మొత్తం 7 విచారణ కమిటీలు వేశారని ఎల్జీ పాలిమర్స్ తరపు న్యాయవాది సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఎన్జీటీ సహా రాష్ట్ర హైకోర్టు, ఎన్‌హెచ్ఆర్‌సీ, ఎన్‌పీసీబీ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున కమిటీలు ఏర్పాటయ్యాయని న్యాయస్థానానికి తెలిపారు.

మే 7న ఘటన జరుగగా ఆ మరుసటి రోజే కమిటీలు వేశారని ఎల్జీ పాలిమర్స్ న్యాయవాది తెలిపారు. అంతే కాకుండా ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాల మేరకు రూ.50 కోట్లు జమ చేశామని కూడా తెలిపారు. అంతకు మించి ఎన్జీటీకి విచారణాధికారం లేదని ఎల్జీ పాలిమర్స్ తరపు వాదనలు విన్న న్యాయస్థానం ఈ కేసులో తదుపరి విచారణను జూన్ 8కి వాయిదా వేసింది.

Tags:    

Similar News