సచిన్‌కు దక్కలేదు.. కానీ కొహ్లీ దక్కించుకున్నాడు
దిశ, స్పోర్ట్స్: ఇండియాలో క్రికెట్ దేవుడిగా పిలుచుకునే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ ఆల్ టైం గ్రేట్ బ్యాట్స్‌మాన్ అని ఎవరైనా ఒప్పుకుంటారు. కానీ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ తాజాగా ప్రకటించిన ఆల్ టైమ్ అత్యుత్తమ ఐదుగురు ఆటగాళ్లలో సచిన్ పేరు లేకపోవడం గమనార్హం. ఇండియా నుంచి విరాట్ కొహ్లీకి జాబితాలో చోటు కల్పించాడు. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా పరుగుల వరద పారిస్తున్న కొహ్లీకి ఈ జాబితాలో చోటు కల్పించడంపై ఎలాంటి అభ్యంతరం లేకపోయినా.. […]
దిశ, స్పోర్ట్స్: ఇండియాలో క్రికెట్ దేవుడిగా పిలుచుకునే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ ఆల్ టైం గ్రేట్ బ్యాట్స్‌మాన్ అని ఎవరైనా ఒప్పుకుంటారు. కానీ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ తాజాగా ప్రకటించిన ఆల్ టైమ్ అత్యుత్తమ ఐదుగురు ఆటగాళ్లలో సచిన్ పేరు లేకపోవడం గమనార్హం. ఇండియా నుంచి విరాట్ కొహ్లీకి జాబితాలో చోటు కల్పించాడు. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా పరుగుల వరద పారిస్తున్న కొహ్లీకి ఈ జాబితాలో చోటు కల్పించడంపై ఎలాంటి అభ్యంతరం లేకపోయినా.. సచిన్‌ను ఎందుకు విస్మరించాడనే దానిపైనే విమర్శలు వస్తున్నాయి. కుక్ రూపొందించిన జాబితాలో బ్రియన్ లారా, జాక్వస్ కలీస్, కుమార సంగక్కర, రికీ పాంటింగ్, విరాట్ కొహ్లీలకు చోటు దక్కింది. బ్రియన్ లారా తర్వాత డేంజరస్ బ్యాట్స్‌మాన్ కొహ్లీనే అని.. అతడికి బౌలింగ్ చేయడం బౌలర్లకు అగ్ని పరీక్ష లాంటిదేనని కుక్ అభిప్రాయపడ్డాడు.