వామ్మో వీడేం బుడ్డోడు.. ఏడాది వయసుకే గిన్నిస్ రికార్డ్..

దిశ, ఫీచర్స్ : నెలలు నిండకుండా జన్మించిన అలబామా బుడ్డోడు.. ఏడాది వయసులో గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సొంతం చేసుకుని ఆశ్చర్యపరిచాడు. మిచెల్ బట్లర్ అనే మహిళ జులై 5, 2020న బర్మింగ్‌ హామ్‌లోని యూనివర్సిటీ హాస్పిటల్‌లో గడువు తేదీకి నాలుగు నెలల ముందే ఎమర్జెన్సీ పరిస్థితుల్లో కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఇద్దరిలో మగశిశువు కర్టిస్ మాత్రమే బయటపడగా.. శరీరం అభివృద్ధి చెందని కారణంగా మరో కవల సోదరి ఒక రోజు తర్వాత మరణించింది. ఈ నేపథ్యంలో […]

Update: 2021-11-14 03:39 GMT

దిశ, ఫీచర్స్ : నెలలు నిండకుండా జన్మించిన అలబామా బుడ్డోడు.. ఏడాది వయసులో గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సొంతం చేసుకుని ఆశ్చర్యపరిచాడు. మిచెల్ బట్లర్ అనే మహిళ జులై 5, 2020న బర్మింగ్‌ హామ్‌లోని యూనివర్సిటీ హాస్పిటల్‌లో గడువు తేదీకి నాలుగు నెలల ముందే ఎమర్జెన్సీ పరిస్థితుల్లో కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఇద్దరిలో మగశిశువు కర్టిస్ మాత్రమే బయటపడగా.. శరీరం అభివృద్ధి చెందని కారణంగా మరో కవల సోదరి ఒక రోజు తర్వాత మరణించింది. ఈ నేపథ్యంలో ఏడాదికాలం పూర్తిచేసుకున్న కర్టిస్‌.. ప్రపంచంలోనే బతికి ఉన్న ‘మోస్ట్ ప్రిమెచ్యూర్ బేబీ’ టైటిల్‌తో గిన్నిస్ రికార్డ్‌లో స్థానం సంపాదించాడు.

నిజానికి పూర్తిస్థాయి గర్భస్థ సమయం దాదాపు 40 వారాలు కాగా.. కర్టిస్, అతడి కవల సోదరి కేవలం 21 వారాల 1 రోజుకే జన్మించారు. పుట్టిన సమయంలో కేవలం 14.8 ఔన్సుల బరువున్న కర్టిస్‌ను వెంటనే వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. ఈ క్రమంలో అతడు పుట్టినప్పటి నుంచి మూడు నెలల కాలం వెంటిలేటర్‌పై ఉండటమే కాకుండా 24 గంటల పాటు వైద్యసంరక్షణలోనే ఉండాల్సి వచ్చింది. అతనికి ఫీడింగ్ ట్యూబ్, బాటిల్ ఆక్సిజన్‌ ద్వారా ప్రత్యేక చికిత్సలు అందుతున్నాయని, ఇది చాలా ఆరోగ్యకరమైనదని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. కాగా కర్టిస్‌ కన్నా ఒక నెల ముందు జూన్ 5, 2020న జన్మించిన విస్కాన్సిన్‌కు చెందిన రిచర్డ్ హచిన్‌సన్‌కు గతంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అందించారు.

Tags:    

Similar News