#Samantha birthday : పెళ్లి తర్వాత కూడా జోరు తగ్గించని కుందనపు బొమ్మ
దిశ, వెబ్ డెస్క్: చిత్ర పరిశ్రమ.. ఇందులో ఒక హీరోయిన్ స్టార్ డమ్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు.. స్టార్ హీరోల సరసన నటించినా స్టార్ హీరోయిన్ గా మారడానికి చాలా కాలమే పడుతుంది. మధ్యలో ఎన్నో అడ్డంకులను దాటుకొని రావాల్సివస్తుంది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటే.. ఆ హీరోయిన్ పని అయిపోయినట్లే అని తేల్చేస్తారు.. కానీ పెళ్లి తర్వాత కూడా టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా వెలుగొందుతున్న […]
దిశ, వెబ్ డెస్క్: చిత్ర పరిశ్రమ.. ఇందులో ఒక హీరోయిన్ స్టార్ డమ్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు.. స్టార్ హీరోల సరసన నటించినా స్టార్ హీరోయిన్ గా మారడానికి చాలా కాలమే పడుతుంది. మధ్యలో ఎన్నో అడ్డంకులను దాటుకొని రావాల్సివస్తుంది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటే.. ఆ హీరోయిన్ పని అయిపోయినట్లే అని తేల్చేస్తారు.. కానీ పెళ్లి తర్వాత కూడా టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా వెలుగొందుతున్న హీరోయిన్ సమంత అక్కినేని. అటు తన కెరీర్ ని, ఇటు ఫ్యామిలీని సమర్థవంతంగా నడిపిస్తూ ఐకానిక్ లేడీ గా మారిపోయింది. నేడు సామ్ బర్త్ డే.. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
2010లో ‘ఏ మాయ చేశావే’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ కుందనపు బొమ్మ తెలుగు కుర్రాళ్లను తన మాయలో పడేసుకుంది. ఇండస్ట్రీకి పరిచయమైన కొద్దీ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించి, మెప్పించింది.’ బృందావనం’, ‘దూకుడు’, ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు’, ‘అత్తారింటికి దారేది’, ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’, ‘ఈగ’ , ‘మహానటి’ , ‘రంగస్థలం’ వంటి సినిమాలు సామ్ ని టాప్ హీరోయిన్ గా నిలబెట్టాయి.
ఇక కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు ఏ హీరోయిన్ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోదు. కానీ సామ్ టాప్ హీరోయిన్ గా ఉన్నప్పుడే అక్కినేని ఇంటి కోడలుగా అడుగుపెట్టింది. తన మొదటి సినిమా హీరోనే ప్రేమించి పెళ్లి చేసుకుంది. నాగ చైతన్యతో వివాహమయ్యి, అక్కినేని ఇంటి కోడలుగా మారాక ఇండస్ట్రీలో సామ్ పని అయిపోయిందనుకున్నారు. కానీ సామ్ పెళ్లి తర్వాత కూడా తన సత్తా చాటుకుంది. లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్స్ కి సై అంటూ మరో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. ‘యూ టర్న్’, ‘ఓ బేబీ’, ‘మజిలీ’ లాంటి చిత్రాలే అందుకు నిదర్శనం. ఇక ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే, ఓటిటీ లోకి అడుగుపెట్టింది. సామ్ జామ్ షో తో బుల్లితెర ప్రేక్షకులను పలకరించింది.
ఇదంతా ఒక వైపు మాత్రమే.. సామ్ లో మరో కోణం ఉంది. అదే మానవత్వం. ఆమె ఎంతోమంది చిన్నపిల్లలను చదివిస్తుంది. అనాధ పిల్లలకోసం ప్రత్యూష ఫౌండేషన్ పేరుతో ఒక ట్రస్ట్ నడుపుతుంది. అంతేకాదు వ్యాపార రంగంలోనూ సామ్ స్టార్ గానే ఎదుగుతుంది. ‘సాకీ’ పేరుతో వస్త్ర రంగంలోకి అడుగుపెట్టి విజయం సాధించింది. అలాగే తన స్నేహితులు ఫ్యాషన్ డిజైనర్ శిల్పా రెడ్డితో పాటు ప్రముఖ విద్యావేత్త ముక్తా ఖురానాతో కలిసి ‘ఏకం’ లెర్నింగ్ సెంటర్‌ని స్టార్ట్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది సమంత. ప్రస్తుతం సామ్ గుణశేఖర్ తెరకెక్కిస్తున్న అందమైన ప్రేమ కావ్యం ‘శాకుంతలం’ లో నటిస్తుంది.