చిన్న పార్టీలతో పొత్తుకు సిద్ధమే.. అఖిలేశ్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో చిన్న పార్టీలతో కలిసి పోటీ చేసేందుకు సిద్ధమేనని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేశ్ యాదవ్ తెలిపారు. చిన్న పార్టీలకు తమ పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యమని వెల్లడించారు. తమ పార్టీపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్, బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ(బీఎస్పీ)లు ఎవరివైపు ఉంటాయో తేల్చుకోవాలని సూచించారు. ఈ పార్టీల పోరాటం బీజేపీకి వ్యతిరేకంగానా లేక ఎస్పీపైనా అనేది వారే […]

Update: 2021-08-01 09:33 GMT

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో చిన్న పార్టీలతో కలిసి పోటీ చేసేందుకు సిద్ధమేనని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేశ్ యాదవ్ తెలిపారు. చిన్న పార్టీలకు తమ పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యమని వెల్లడించారు. తమ పార్టీపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్, బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ(బీఎస్పీ)లు ఎవరివైపు ఉంటాయో తేల్చుకోవాలని సూచించారు.

ఈ పార్టీల పోరాటం బీజేపీకి వ్యతిరేకంగానా లేక ఎస్పీపైనా అనేది వారే నిర్ణయించుకోవాలని హితవుపలికారు. ఇప్పటికే అనేక చిన్న పార్టీలు తమతో ఉన్నాయని, ఇంకా వస్తాయని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. బీజేపీ తప్పుడు పాలనను ప్రజలకు తెలియజేసేందుకు ఈ నెల 15నుంచి యాత్రలు చేపడుతామని అఖిలేశ్ వెల్లడించారు. కొవిడ్‌ను నియంత్రణలో రాష్ట్రంలోని యోగి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

ఆక్సిజన్, మందుల కొరతతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని వాపోయారు. సెకండ్ వేవ్‌ సమయంలో ఆస్పత్రులు, శ్మశానాల వద్ద పరిస్థితులను ప్రజలందరూ గమనించారని, ఇందుకు బీజేపీ ప్రభుత్వానికి సరైన టైంలో సరైన సమాధానం చెప్తారని తెలిపారు. గత ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదని మండిపడ్డారు. ధరల పెరుగుదల, గంగానదిని శుభ్రపరచడం వంటి అనేక సమస్యలతో బీజేపీ ఎమ్మెల్యేలు సంతృప్తికరంగా లేరని చెప్పారు.

 

Tags:    

Similar News