వైట్‌హౌస్ బృందంలో ఈషా

దిశ,వెబ్‌డెస్క్ :అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ బృందంలో భారత సంతతికి చెందిన అమెరికన్లు కీరోల్ ప్లే చేస్తున్నారు. ఈనేపథ్యంలో జో బైడెన్ వైట్‌హౌస్ ఆఫీస్ ఆఫ్ డిజిటల్ స్ట్రాటజీ సభ్యుల్లో కాశ్మీర్ కు చెందిన ఈషా షాను పార్ట్‌నర్‌షిప్ మేనేజర్‌గా నియమించారు. గతంలో ఈషా.., బైడెన్ – కమలా హారిస్ అమెరికా ఎన్నికల సోషల్ మీడియా వింగ్ విభాగంలో పనిచేశారు. ప్రస్తుతం ఆమె స్మిత్సోనియన్‌ ఇనిస్టిట్యూషన్‌కు అడ్వాన్స్‌మెంట్ స్పెషలిస్ట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో జాన్ ఎఫ్ […]

Update: 2020-12-28 22:32 GMT

దిశ,వెబ్‌డెస్క్ :అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ బృందంలో భారత సంతతికి చెందిన అమెరికన్లు కీరోల్ ప్లే చేస్తున్నారు. ఈనేపథ్యంలో జో బైడెన్ వైట్‌హౌస్ ఆఫీస్ ఆఫ్ డిజిటల్ స్ట్రాటజీ సభ్యుల్లో కాశ్మీర్ కు చెందిన ఈషా షాను పార్ట్‌నర్‌షిప్ మేనేజర్‌గా నియమించారు.

గతంలో ఈషా.., బైడెన్ – కమలా హారిస్ అమెరికా ఎన్నికల సోషల్ మీడియా వింగ్ విభాగంలో పనిచేశారు. ప్రస్తుతం ఆమె స్మిత్సోనియన్‌ ఇనిస్టిట్యూషన్‌కు అడ్వాన్స్‌మెంట్ స్పెషలిస్ట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో జాన్ ఎఫ్ కెన్నెడీ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ కార్పొరేట్ ఫండ్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోబైడెన్ సోషల్ మీడియా విభాగంలో కీలకపాత్ర పోషించారు.

వైట్‌హౌస్ ఆఫీస్‌ఆఫ్ డిజిటల్ స్ట్రాటజీలో బ్రెండన్ కోహెన్ (ప్లాట్‌ఫామ్ మేనేజర్), మహా ఘండౌర్ (డిజిటల్ పార్ట్‌నర్‌షిప్ మేనేజర్), జోనాథన్ హెబర్ట్ (వీడియో డైరెక్టర్), జైమ్ లోపెజ్ (ప్లాట్‌ఫాం డైరెక్టర్), కరాహ్నా మాగ్‌వుడ్ (క్రియేటివ్ డైరెక్టర్), అబ్బే పిట్జెర్ (డిజైనర్), ఒలివియా రైస్నర్ (ట్రావెలింగ్ కంటెంట్ డైరెక్టర్), రెబెకా రింకెవిచ్ (డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ డిజిటల్ స్ట్రాటజీ), క్రిస్టియన్ టామ్ (డిజిటల్ స్ట్రాటజీ డిప్యూటీ డైరెక్టర్) మరియు కామెరాన్ ట్రింబుల్ (డిజిటల్ ఎంగేజ్‌మెంట్ డైరెక్టర్) లు పనిచేస్తున్నారు.

వైట్‌హౌస్ బృందం సభ్యుల్ని ప్రకటించిన జోబైడెన్ మాట్లాడుతూ.., ” కొత్తగా ఎంపికైన వైట్‌హౌస్ బృందం సభ్యులకు అన్నీ విభాగాల్లో మంచి నైపుణ్యం ఉందని, ఇక సోషల్ మీడియా విభాగం వైట్‌హౌస్‌ నుంచే అమెరికన్ ప్రజలకు కొత్తగా, వినూత్న మార్గాల్లో సేవలందించనున్నట్లు జోబైడెన్ తెలిపారు.

Tags:    

Similar News