ఎయిర్ టెల్ వినియోగదారులకు బిగ్ షాక్.. మరో నాలుగు రోజుల్లో..
దిశ, వెబ్ డెస్క్ : వినియోగదారులకు ఎయిర్ టెల్ మరో షాక్ ఇచ్చింది. ఇంత వరకూ ఉన్న ప్రీ పెయిడ్ చార్జీలను పెంచనున్నట్టు ప్రకటించింది. మరో నాలుగు రోజుల్లో పెరిగిన ధరలు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. వాయిస్ ప్లాన్ పై 20 శాతం అలాగే అనిలిమిటెడ్ ప్లాన్ పై 25 శాతం పెంచడంతో ధరలకు రెక్కలొచ్చాయి. నవంబర్ 26 నుంచి ఈ ధరలు వర్తిస్తాయని వివరించింది. పెరిగిన ధరల వల్ల ప్రతి వినియోగదారుడి నుంచి 200 కాకుండా […]
దిశ, వెబ్ డెస్క్ : వినియోగదారులకు ఎయిర్ టెల్ మరో షాక్ ఇచ్చింది. ఇంత వరకూ ఉన్న ప్రీ పెయిడ్ చార్జీలను పెంచనున్నట్టు ప్రకటించింది. మరో నాలుగు రోజుల్లో పెరిగిన ధరలు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. వాయిస్ ప్లాన్ పై 20 శాతం అలాగే అనిలిమిటెడ్ ప్లాన్ పై 25 శాతం పెంచడంతో ధరలకు రెక్కలొచ్చాయి. నవంబర్ 26 నుంచి ఈ ధరలు వర్తిస్తాయని వివరించింది. పెరిగిన ధరల వల్ల ప్రతి వినియోగదారుడి నుంచి 200 కాకుండా 300 రూపాయలు కంపెనీకు అందుతాయి.
ఇలా ధరలు పెంచడాన్ని కూడా కంపెనీ సమర్ధించుకుంది. ఇది ఆరోగ్యకరమైన పెరుగుదల అని, దీని వల్ల భవిష్యత్తులో కొత్త సేవలను అందించడానికి ఉపకరిస్తుందని తెలిపింది. త్వరలో మన దేశంలో 5G సేవలను తీసుకు రానున్నామని దానికి పెట్టుబడిగా పనికి వస్తుందని వివరించింది. ఆదాయం పెరగడం వల్ల స్పెక్ట్రం కొనుగోళ్లు, నెట్ వర్క్ విస్తరణ లాంటివి చేయవచ్చని తెలిపింది. ధరల పెరుగుదల ప్రకటించడంతో మార్కెట్ లో ఎయిర్ టెల్ షేర్లు లాభాల్లో నడుస్తున్నాయి.