హై-స్పీడ్ నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడ్ చేసిన ఎయిర్‌టెల్.. ఇక ఆ రాష్ట్రాలకు పండగే
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ తెలుగు రాష్ట్రాల్లో తన హై-స్పీడ్ నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడ్ చేసినట్టు ప్రకటించింది. 4జీ నెట్‌వర్క్ కోసం 900 మెగా హెర్ట్జ్ బ్యాండ్‌లో అదనంగా 4ఎంహెచ్‌జెడ్ మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్‌ను చేర్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మొత్తంగా 10 వేల మొబైల్ సైట్లను 4జీకి అప్‌గ్రేడ్ చేసినట్టు ఎయిర్‌టెల్ వెల్లడించింది. భారతీ ఎయిర్‌టెల్‌కు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో అతిపెద్ద 65.4 మెగా హెర్ట్జ్ స్పెక్ట్రమ్ ఉంది. రెండు రాష్ట్రాల్లోనూ కలిపి ఎయిర్‌టెల్‌కు […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ తెలుగు రాష్ట్రాల్లో తన హై-స్పీడ్ నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడ్ చేసినట్టు ప్రకటించింది. 4జీ నెట్‌వర్క్ కోసం 900 మెగా హెర్ట్జ్ బ్యాండ్‌లో అదనంగా 4ఎంహెచ్‌జెడ్ మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్‌ను చేర్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మొత్తంగా 10 వేల మొబైల్ సైట్లను 4జీకి అప్‌గ్రేడ్ చేసినట్టు ఎయిర్‌టెల్ వెల్లడించింది. భారతీ ఎయిర్‌టెల్‌కు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో అతిపెద్ద 65.4 మెగా హెర్ట్జ్ స్పెక్ట్రమ్ ఉంది. రెండు రాష్ట్రాల్లోనూ కలిపి ఎయిర్‌టెల్‌కు 3.1 కోట్లకు పైగా వినియోగదారులున్నారు. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లోని మొత్తం 97 శాతం జనాభా పరిధిలో ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ విస్తరించి ఉంది. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన కవరేజ్‌ను అందించి వినియోగదారు సామర్థ్యాన్ని పెంచుకోవడం, నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఉన్నట్టు ఎయిర్‌టెల్ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
‘అదనంగా 900 మెగా హెర్ట్జ్ బ్యాండ్‌ను విస్తరించడం వల్ల కస్టమర్లకు ఇండోర్ కవరేజీ పెరుగుతుందని, దీనివల్ల తెలుగు రాష్ట్రాల్లోని ఎయిర్‌టెల్ 4జీ స్పెక్ట్రమ్ బ్యాండ్ మరింత శక్తివంతమవుతుంది. టెలికాం రంగంలో పోటీని కొనసాగించేందుకు ఈ మధ్యనే 5జీ సేవలను హైదరాబాద్‌లో నిర్వహించినట్టు’ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎయిర్‌టెల్ సీఈఓ అవ్‌నీత్ సింగ్ వివరించారు. అంతేకాకుండా రానున్న రోజుల్లో అత్యాధునిక నెట్‌వర్క్ టెక్నాలజీ విస్తరణ ద్వారా తమ వినియోగదారులను సంతృప్తి పరుస్తామని, అందుకు అవసరమైన పెట్టుబడులు పెడుతున్నట్టు ఆయన వెల్లడించారు.