ఎయిర్ఇండియా ప్రైవేటీకరణ వేగవంతం
దిశ, వెబ్‌డెస్క్: ఎయిర్ఇండియా ప్రైవేటీకరణ ప్రక్రియను కేంద్రం వేగవంతం చేస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ప్రైవేటీకరణ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నట్టు వెల్లడించింది. దీనికోసం ఆర్థిక బిడ్‌లను ఆహ్వానించే ప్రక్రియను ప్రారంభించింది. ప్రాథమిక బిడ్‌లను విశ్లేషించిన అనంతరం అర్హత కలిగిన పెట్టుబడిదారుల సందేహాలకు వర్చువల్ డేటా రూమ్(వీడీఆర్) ద్వారా సమాధానమివ్వనున్నారు. గతేడాది డిసెంబర్‌లో జరిగిన ప్రాథమిక బిడ్‌ల ప్రక్రియలో టాటా గ్రూప్ కూడా బిడ్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. 2007లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విలీన […]
దిశ, వెబ్‌డెస్క్: ఎయిర్ఇండియా ప్రైవేటీకరణ ప్రక్రియను కేంద్రం వేగవంతం చేస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ప్రైవేటీకరణ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నట్టు వెల్లడించింది. దీనికోసం ఆర్థిక బిడ్‌లను ఆహ్వానించే ప్రక్రియను ప్రారంభించింది. ప్రాథమిక బిడ్‌లను విశ్లేషించిన అనంతరం అర్హత కలిగిన పెట్టుబడిదారుల సందేహాలకు వర్చువల్ డేటా రూమ్(వీడీఆర్) ద్వారా సమాధానమివ్వనున్నారు. గతేడాది డిసెంబర్‌లో జరిగిన ప్రాథమిక బిడ్‌ల ప్రక్రియలో టాటా గ్రూప్ కూడా బిడ్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
2007లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విలీన తర్వాత నుంచి ఎయిర్ఇండియాకు నష్టాల్లో కొనసాగుతోంది. ఎయిర్ఇండియాను కొనుగోలు చేసే కంపెనీకి 4,400 దేశీయ, 1,800 అంతర్జాతీయ ల్యాండింగ్, పార్కింగ్ స్లాట్‌లు లభిస్తాయి. విదేశాల్లో ఉన్న విమానాశ్రయాల్లో 900 వరకు స్లాట్‌లు దక్కనున్నాయి. ఎయిర్ఇండియా విక్రయాన్ని కేంద్రం 2017లో ప్రారంభించింది. కంపెనీకి చెందిన రూ. 60,074 కోట్ల రుణాలను భరించాలనే నిబంధనను విధించడంతో ఎవరూ ముందుకు రాలేదు. దాంతో కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చే సంస్థలు రుణాలను తమకిష్టమైన మేరకు తీసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.