హైదరాబాద్ టు చికాగో నాన్‌స్టాప్ ఫ్లైట్
దిశ, రాజేంద్రనగర్: హైదరాబాద్ నుంచి చికాగోకు నాన్ స్టాప్ విమాన సర్వీసు ప్రారంభమైంది. వారానికి ఒకరోజు చొప్పున ఎయిర్ ఇండియా ఈ సర్వీసును ప్రారంభించింది. చికాగో నుంచి శుక్రవారం తెల్లవారుజామున ఒంటిగంటకు ఎయిర్ ఇండియా నాన్ స్టాప్ విమానంలో 237 ప్రయాణికులు, 16 మంది సిబ్బందితో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాగా విమానాశ్రయ సిబ్బంది ప్రయాణికులకు ఆహ్వానం పలికారు. అదే ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ విమానం శుక్రవారం మధ్యాహ్నం 12.50 గంటలకు హైదరాబాద్ నుంచి 226 […]
దిశ, రాజేంద్రనగర్: హైదరాబాద్ నుంచి చికాగోకు నాన్ స్టాప్ విమాన సర్వీసు ప్రారంభమైంది. వారానికి ఒకరోజు చొప్పున ఎయిర్ ఇండియా ఈ సర్వీసును ప్రారంభించింది. చికాగో నుంచి శుక్రవారం తెల్లవారుజామున ఒంటిగంటకు ఎయిర్ ఇండియా నాన్ స్టాప్ విమానంలో 237 ప్రయాణికులు, 16 మంది సిబ్బందితో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాగా విమానాశ్రయ సిబ్బంది ప్రయాణికులకు ఆహ్వానం పలికారు. అదే ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ విమానం శుక్రవారం మధ్యాహ్నం 12.50 గంటలకు హైదరాబాద్ నుంచి 226 ప్రయాణికులు, 16 మంది సిబ్బందితో చికాగోకు బయలుదేరి వెళ్లింది.
ఈ సందర్భంగా ఎయిర్‌పోర్ట్ సీఈఓ ప్రదీప్ ఫిణికర్ మాట్లాడుతూ.. చికాగో-హైదరాబాద్‌ను కలిపే కొత్త సర్వీసును ఎయిర్ ఇండియా ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ప్రయాణికుల డిమాండ్లను తీర్చడానికి, గమ్యస్థానాలను కనెక్ట్ చేయడానికి హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. ప్రమాణాల భద్రతపై దృష్టి సారించి, ప్రయాణికులకు సేవ చేయడానికి, మరిన్ని దేశీయ, అంతర్జాతీయ నగరాలను కనెక్ట్ చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.