పాక్‌లో విమానం కూలి 98 మంది మృతి
కరాచీ: పాకిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. లాహోర్ నుంచి కరాచీ బయల్దేరిన పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ)కు చెందిన ఎయిర్‌బస్ ఏ-320 జిన్నా అంతర్జాతీయ విమానశ్రయానికి సమీపంలో జన నివాసాల మధ్య కుప్పకూలింది. విమానంలో 90 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారు. ల్యాండింగ్‌కు కొన్ని నిమిషాల ముందు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో 98 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆర్మీ క్విక్ రియాక్షన్ ఫోర్స్, సింధ్ పాకిస్థాన్ రేంజర్స్ సంఘటన స్థలానికి చేరుకుని […]
కరాచీ: పాకిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. లాహోర్ నుంచి కరాచీ బయల్దేరిన పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ)కు చెందిన ఎయిర్‌బస్ ఏ-320 జిన్నా అంతర్జాతీయ విమానశ్రయానికి సమీపంలో జన నివాసాల మధ్య కుప్పకూలింది. విమానంలో 90 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారు. ల్యాండింగ్‌కు కొన్ని నిమిషాల ముందు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో 98 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆర్మీ క్విక్ రియాక్షన్ ఫోర్స్, సింధ్ పాకిస్థాన్ రేంజర్స్ సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు మొదలు పెట్టాయని ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్(ఐఎస్‌పీఆర్) తెలిపింది. కరాచీ నగరంలోని ప్రధాన హాస్పిటళ్లలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. విమాన ప్రమాదాన్ని పాక్ ఇంటర్ నేషనల్ ఎయిర్ లైన్స్ అధికార ప్రతినిధి అబ్దుల్ సత్తార్ ధృవీకరించారు.