సుశాంత్‌ది ఆత్మహత్యే.. నిర్ధారించిన ఎయిమ్స్

దిశ, సినిమా: సుశాంత్ సింగ్ రాజ్‌పు‌త్ డెత్ యానివర్సరీ రోజున కీలక ప్రకటన చేసింది ఎయిమ్స్. అతను ఆత్మహత్య చేసుకున్నాడని కన్‌ఫర్మ్ చేసింది. నేషనల్ మీడియా రిపోర్ట్ ప్రకారం.. సీబీఐ ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా వర్క్ చేసిన ఎయిమ్స్ ఫోరెన్సిక్ టీమ్ సుశాంత్ జూన్ 14, 2020 ఉ. 10:10 నిమిషాలకు చనిపోయినట్లు నిర్ధారించారు. తన బాడీ మీద ఎలాంటి గాయాలు లేవని, చనిపోయే ముందు లిక్కర్ సేవించలేదని రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఉ. 9:30 నిమిషాలకు కేవలం గ్లాస్ […]

Update: 2021-06-14 06:07 GMT

దిశ, సినిమా: సుశాంత్ సింగ్ రాజ్‌పు‌త్ డెత్ యానివర్సరీ రోజున కీలక ప్రకటన చేసింది ఎయిమ్స్. అతను ఆత్మహత్య చేసుకున్నాడని కన్‌ఫర్మ్ చేసింది. నేషనల్ మీడియా రిపోర్ట్ ప్రకారం.. సీబీఐ ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా వర్క్ చేసిన ఎయిమ్స్ ఫోరెన్సిక్ టీమ్ సుశాంత్ జూన్ 14, 2020 ఉ. 10:10 నిమిషాలకు చనిపోయినట్లు నిర్ధారించారు. తన బాడీ మీద ఎలాంటి గాయాలు లేవని, చనిపోయే ముందు లిక్కర్ సేవించలేదని రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఉ. 9:30 నిమిషాలకు కేవలం గ్లాస్ వాటర్, దానిమ్మ జ్యూస్ తీసుకున్నట్లు వెల్లడించారు.

‘మేము మా పరిశోధనలను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌కు సమర్పించాం. ఎయిమ్స్ మెడికల్ బోర్డ్ ముంబైని సందర్శించి, సుశాంత్‌ బాడీపై ఉన్న గాయం గుర్తులు, కారులో ఉన్న వందకుపైగా రసాయనాలు, మాదకద్రవ్యాలను పరిశీలించేందుకు సీన్ రీక్రియేట్ చేశాం. ఈ బృందంలో ఏడుగురు వైద్యులు ఉన్నారు. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఫారిన్ లిటరేచర్‌తో ఇండివిడ్యువల్‌గా కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఐదు నుంచి ఆరుగంటల మీటింగ్ తర్వాత సుశాంత్ ఊపిరాడక చనిపోయినట్లు డాక్టర్స్ టీమ్ నిర్ధారించింది’ అని ఎయిమ్స్ ఫోరెన్సిక్ టీమ్ హెడ్ డాక్టర్ సుధీర్ గుప్తా వెల్లడించారు.

Tags:    

Similar News