ప్రధాని ముందు మోకరిల్లడానికే : మధుయాష్కి

దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో బీజేపీపైన విమర్శలు చేసిన సీఎం కేసీఆర్​ ఇప్పుడు ఢిల్లీ వెళ్లి ప్రధాని ముందు మోకరిల్లుతున్నాడని ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కి విమర్శించారు. సీఎం కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన వెనుక రహస్యమేమిటంటూ ప్రశ్నించారు. గాంధీభవన్​లో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. సీబీఐ, ఈడీ కేసులకు భయపడి సీఎం కేసీఆర్‌ ఢిల్లీ వెళ్తున్నారా అని అనుమానం వ్యక్తం చేశారు. బీజేపీ, టీఆర్​ఎస్​, ఎంఐఎం కలిసి ప్రజలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. కేసీఆర్‌ లేకపోతే తెలంగాణ లేదనడం […]

Update: 2020-12-11 10:01 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో బీజేపీపైన విమర్శలు చేసిన సీఎం కేసీఆర్​ ఇప్పుడు ఢిల్లీ వెళ్లి ప్రధాని ముందు మోకరిల్లుతున్నాడని ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కి విమర్శించారు. సీఎం కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన వెనుక రహస్యమేమిటంటూ ప్రశ్నించారు. గాంధీభవన్​లో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. సీబీఐ, ఈడీ కేసులకు భయపడి సీఎం కేసీఆర్‌ ఢిల్లీ వెళ్తున్నారా అని అనుమానం వ్యక్తం చేశారు. బీజేపీ, టీఆర్​ఎస్​, ఎంఐఎం కలిసి ప్రజలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. కేసీఆర్‌ లేకపోతే తెలంగాణ లేదనడం స్వార్థరాజకీయాలకు నిదర్శనమని, కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు టీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎం కుట్రలు చేస్తోందని, మతం పేరుతో రెచ్చగొట్టేవారికి యువత దూరంగా ఉండాలని మధుయాష్కి సూచించారు.

Tags:    

Similar News