రేవంత్‌కు హుజురాబాద్ గండం.. వారందరినీ ఢిల్లీకి పిలిచిన హైకమాండ్​

దిశ, తెలంగాణ బ్యూరో : హుజురాబాద్​ ఉప ఎన్నిక టీఆర్ఎస్‌కు ఎంత షాక్​ ఇచ్చిందో.. కాంగ్రెస్‌లో అంతకంటే ఎక్కువ చిచ్చు పెట్టింది. టీపీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డి సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో పడేసింది. కాంగ్రెస్ పార్టీ డిపాజిట్‌లను సైతం దక్కించుకోలేని స్థితిలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న ప్రభావం టీపీసీసీపై స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఘోర పరాజయాన్ని జీర్ణించుకోలేని సీనియర్లు.. ఇదే అదునుగా హైకమాండ్‌కు మొరపెట్టుకున్నారు. టీపీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డి టార్గెట్‌గా లేఖలు పంపారు. ఇదే సమయంలో హుజురాబాద్‌లో ఇంతటి ఘోర పరాజయానికి […]

Update: 2021-11-12 18:12 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : హుజురాబాద్​ ఉప ఎన్నిక టీఆర్ఎస్‌కు ఎంత షాక్​ ఇచ్చిందో.. కాంగ్రెస్‌లో అంతకంటే ఎక్కువ చిచ్చు పెట్టింది. టీపీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డి సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో పడేసింది. కాంగ్రెస్ పార్టీ డిపాజిట్‌లను సైతం దక్కించుకోలేని స్థితిలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న ప్రభావం టీపీసీసీపై స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఘోర పరాజయాన్ని జీర్ణించుకోలేని సీనియర్లు.. ఇదే అదునుగా హైకమాండ్‌కు మొరపెట్టుకున్నారు. టీపీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డి టార్గెట్‌గా లేఖలు పంపారు. ఇదే సమయంలో హుజురాబాద్‌లో ఇంతటి ఘోర పరాజయానికి కారకులైన నేతలపై కాంగ్రెస్ అధిష్టానం కన్నెర్ర జేసింది.

హుజురాబాద్​పై పార్టీలో పోస్టుమార్టం నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్​ నేత రాహుల్​గాంధీ దీనిపై చర్చించనున్నారు. దీనికోసం టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డితో పాటుగా సీఎల్పీ నేత భట్టి, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్​దామోదర రాజనర్సింహా, మాజీ ఎంపీ వీహెచ్, పార్టీ ప్రచార కమిటీ చైర్మన్​మధుయాష్కీ, అభ్యర్థి బల్మూరి వెంకట్​సహా మొత్తం 13 మందిని ఢిల్లీకి పిలిచారు. శనివారం ముందుగా పార్టీ ముఖ్యనేత కేసీ వేణుగోపాల్, ఆ తర్వాత రాహుల్​గాంధీ వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. ఏఐసీసీ పిలుపుతో కాంగ్రెస్​ నేతలు హస్తిన బాట పట్టారు.

గత ఎన్నికల్లో హుజురాబాద్ లో కాంగ్రెస్ పార్టీ దాదాపు 61 వేల ఓట్లు సొంతం చేసుకోగా మొన్నటి ఉప ఎన్నికలో మాత్రం కేవలం 3014 ఓట్లకు మాత్రమే పరిమితమైంది. దీనిపై ఒక విధంగా పార్టీలోని సీనియర్లు ఆజ్యం రగల్చగా.. హైకమాండ్​ కూడా సీరియస్​కావడంతో ప్రధానంగా రేవంత్​రెడ్డి ఇరకాటంలో పడినట్లు అయింది.

ఇంత దారుణమా..?

హుజురాబాద్​ఉప ఎన్నికలో ఎలాంటి పరిణామాలు జరిగినా.. కాంగ్రెస్‌కు మాత్రం రాష్ట్రంలో తీరని దెబ్బను చూపించింది. మొన్నటి వరకు రాష్ట్రంలో కాంగ్రెస జోష్​వస్తుందని సంబురపడుతున్న సమయంలో ఈ ఫలితం పార్టీ నేతలను తలెత్తుకోలేని పరిస్థితికి తీసుకువచ్చింది. ఇదే సమయంలో రేవంత్​రెడ్డిపై అసంతృప్తితో ఉన్న నేతలకు ఇదో అవకాశంగా చిక్కింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్​ కోసమే ఇక్కడ చేజేతులా ఓడిపోయినట్లు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డితో సహా పలువురు సీనియర్లు ఆరోపించారు. అంతేకాదు.. వీహెచ్, జగ్గారెడ్డి వంటి నేతలు హైకమాండ్‌కు లేఖలు పంపించారు. ఈ క్రమంలోనే ఓటమిపై సమీక్ష నిర్వహించాలని హైకమాండ్ నిర్ణయించింది. అయితే ఇప్పటికే అక్కడ ఓటమికి తనదే పూర్తి బాధ్యత అంటూ రేవంత్​రెడ్డి సైతం ప్రకటించారు. కానీ ఫిర్యాదులు మాత్రం ఆగలేదు.

అటు ఠాగూర్​పైనా..!

హుజురాబాద్ ఫలితంపై సీనియర్లు యథాతధంగా తమ పంథాను కొనసాగిస్తున్నట్లుగా రాజకీయ వ్యవహారాల కమిటీలో సైతం ధిక్కార స్వరం వినిపించారు. ఇదే సమయంలో ఓటమిని కేవలం రేవంత్‌పైనే బాధ్యత మోపడం సరికాదంటూ సీనియర్ నేత జానారెడ్డి వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ దీన్ని పార్టీ నేతలు పట్టించుకోలేదు. అటు పార్టీ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్ కూడా పార్టీ నేతలకు వివరించే ప్రయత్నాలు చేసినా.. సీనియర్లు పెడచెవిన పెట్టారు. అంతేకాదు.. ఠాగూర్​పైనా కూడా హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు. ఠాగూర్ వచ్చిన తర్వాత ఏ ఎన్నికల్లోనూ పార్టీ విజయం సాధించడం లేదని, ఠాగూర్​ ఇక్కడ సమన్వయం చేయడంలో విఫలమవుతున్నాడంటూ ఫిర్యాదు చేసినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.

ఇప్పుడేంది

ప్రస్తుతం హుజురాబాద్​ ఫలితాల విశ్లేషణ పేరుతో 13మంది పార్టీ ముఖ్యులను కాంగ్రెస్​ హైకమాండ్​ ఢిల్లీకి పిలిచింది. శనివారం వారితో సమావేశం కానున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఢిల్లీ పెద్దలు కూడా టీపీసీసీ చీఫ్​ రేవంత్‌ను వదులుకునేందుకు ఇష్టంగా లేరని స్పష్టమవుతోంది. ఇదే సమయంలో సీనియర్లను బుజ్జగించడం కూడా సమస్యగానే మారింది. పలుమార్లు ఎవరూ వ్యతిరేక విమర్శలు చేయరాదంటూ ఢిల్లీ పెద్దలు సూచించినా.. రాష్ట్ర నేతలు అడపాదడపా బాంబు పేల్చుతూనే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో వీటన్నింటికీ ముగింపు పలుకాలని హైకమాండ్​ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఓటమిపై సమీక్ష చేస్తూనే ఇక ముందు రాష్ట్రంలో రేవంత్‌కు సహకారం, సీనియర్లను దారికి తెచ్చుకోవడం, పార్టీలో క్రమశిక్షణను బలోపేతం చేయడం వంటి అంశాలను రాహుల్​గాంధీ స్వయంగా చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

మేమూ రెడీ

మరోవైపు టీపీసీసీ నుంచి కూడా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేసుకుని ఢిల్లీ ఫ్లైటెక్కుతున్నారు. రాష్ట్రంలో కోవర్టులు, అసంతృప్తి నేతల జాబితా, ఇప్పటి వరకు వారు చేసిన ప్రయత్నాలు, ఆరోపణలకు సంబంధించిన వీడియోలను అధిష్టానం ముందు పెట్టనున్నారు. ఇదే సమయంలో సీనియర్లు కూడా పార్టీ హైకమాండ్​ ముందు తమ విమర్శలను ఎక్కు పెట్టనున్నారు. టీపీసీసీ ఇచ్చే వివరణలను ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో కాంగ్రెస్​పార్టీలో హుజురాబాద్​కాక పుట్టిస్తోంది.

కాగా టీపీసీసీపై వరుస ఫిర్యాదులు చేసిన నేతలను కూడా ఢిల్లీ పెద్దలు పిలిచారు. అయితే ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి మాత్రం మాల్దీవుల పర్యటకు వెళ్తున్నట్లు పార్టీకి సమాచారమిచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన సమావేశానికి గైర్హాజరైనట్టే.

కాడెత్తేసిన కాంగ్రెస్..​అంతా సైలెంట్..!​

Tags:    

Similar News