అమ్మాయిల ఫొటోలు మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్
దిశ, వెబ్‌డెస్క్: అమ్మాయిల ఫోటోలను మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్న సైబర్ చీటర్‌ను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో యువతుల ఫోటోలు సేకరించి.. సోషల్ మీడియా వేదికగా బ్లాక్ మెయిల్ చేస్తూ టార్చర్ పెడుతున్న ఆదోనికి చెందిన మహ్మద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే వందమందికి పైగా ఫోటోలను మార్ఫింగ్ చేసి రాక్షస ఆనందం పొందుతున్న యువకుడి ట్రాప్‌లో పడి పలువురు యువతులు మోసపోయారు. హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి పోలీసులకు […]
దిశ, వెబ్‌డెస్క్: అమ్మాయిల ఫోటోలను మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్న సైబర్ చీటర్‌ను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో యువతుల ఫోటోలు సేకరించి.. సోషల్ మీడియా వేదికగా బ్లాక్ మెయిల్ చేస్తూ టార్చర్ పెడుతున్న ఆదోనికి చెందిన మహ్మద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే వందమందికి పైగా ఫోటోలను మార్ఫింగ్ చేసి రాక్షస ఆనందం పొందుతున్న యువకుడి ట్రాప్‌లో పడి పలువురు యువతులు మోసపోయారు. హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి మహ్మద్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై తెలంగాణతో పాటు, ఆంధ్రప్రదేశ్‌లో కేసులు ఉన్నాయి.