తెలంగాణలో కోటి 28 లక్షల ఎకరాల సాగుబడి

రాష్ట్రంలో వానాకాలం సీజన్ సాగు కోటి 28 లక్షల 20 వేల 698 ఎకరాలకు చేరింది. ఈ మేరకు గురువారం వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది.

Update: 2022-09-01 17:19 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో వానాకాలం సీజన్ సాగు కోటి 28 లక్షల 20 వేల 698 ఎకరాలకు చేరింది. ఈ మేరకు గురువారం వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. దీని ప్రకారం ఈ సీజన్‌లో వరి ఇప్పటివరకు 58,28,686 ఎకరాలు, పత్తి 48,95,905 ఎకరాల్లో సాగైనట్టు అధికారులు పేర్కొన్నారు. కాగా కంది 7 లక్షలకు టార్గెట్ పెట్టుకోగా కేవలం 5,50,020 ఎకరాల్లోనే సాగైంది. దీంతో పాటు పెసలు, మినుములు, వేరుశనగ పంటలు సైతం నామ మాత్రంగానే సాగయ్యాయి. సోయాబీన్ 4,29,029 ఎకరాల్లో సాగైంది. చిరు, తృణ ధాన్యాలు మాత్రం కేవలం 3,492 ఎకరాల్లోనే సాగయ్యాయి. కాగా ఈ ఏడాది ఇప్పటివరకు 104 శాతం మేర అన్ని రకాల పంటలు సాగైనట్టు నివేదికలో పేర్కొన్నారు. వానాకాలం సాగులో నల్గొండ జిల్లా 10,59,974 ఎకరాలతో టాప్‌లో ఉండగా ఆదిలాబాద్ 5,61,666 ఎకరాలతో రెండో స్థానంలో నిలిచింది.


Similar News