Fish Farming: కొర్రమీను చేపల పెంపకంతో లక్షల్లో లాభాలు!

కొర్రమీను చేపల పెంపకంతో లక్షల్లో లాభాలు

Update: 2024-09-05 08:58 GMT

దిశ, వెబ్ డెస్క్ : వ్యవసాయం అన్ని సమయాల్లో కలిసి వస్తుందని గ్యారంటీ లేదు.. ఎందుకంటే వర్షాలు ఎక్కువ పడిన ఇబ్బందే .. తక్కువ పడినా కూడా ఇబ్బందే.. ప్రకృతి సహకరిస్తేనే అధిక దిగుబడిని పొందగలరు. కానీ, అకాల వర్షాల కారణంగా పంట చేతికి అందకుండా పోతుంది. ఈ సమయంలోనే కొందరు రైతులు ముందు జాగ్రత్తతో ఇతర ఉపాధి పనులను చేసుకుంటూ తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు.

బొమ్మ కళ్ళు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గత రెండేళ్ళగా కొర్ర మీను చేపల వ్యాపారం చేస్తున్నాడు. దీని కోసం పెద్దగా కష్ట పడాల్సిన అవసరం లేదు.సరైన సూచనలు పాటిస్తే లాభాలు అధికంగా వస్తాయని ఆ రైతు చెబుతున్నాడు. ఆయన చేపల పెంపకం నుంచి లక్షలు ఎలా సంపాదిస్తున్నాడో ఇక్కడ తెలుసుకుందాం..

చేపల పెంపకం మొదలు పెట్టిన సమయంలో ముందు నీరు శుభ్రంగా ఉన్నాయో .. లేదో చూసుకోవాలి. లేదంటే చేప పిల్లలను చనిపోయే ప్రమాదం ఉంది. అలాగే, ఆహారం విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. చిన్న చేప పిల్లలు ఒక్కొక్కటి 15 రూపాయలకు తీసుకొని అవి పెరిగి పెద్దయిన తర్వాత కేజీ 350 నుంచి 500 రూపాయలకు ఒక్కొక్కటి అమ్ముతున్నారు. ఇలా ఏడాదిలో రూ. 4 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు లాభాలు వస్తున్నాయని అతను చెబుతున్నాడు. 

Tags:    

Similar News