Cattle Diseases : అసలే వర్షాకాలం.. పశువుల సస్యరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!
మనుషులకు చిన్న వ్యాధి వస్తేనే అల్లాడిపోతున్నారు అలాంటిది మూగజీవాలు పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి.
దిశ, వెబ్ డెస్క్: పల్లెటూళ్ళలో అనేక మంది రైతులు వ్యవసాయంతో పాటు పశువులను కూడ జీవనాధారం. ఎందుకంటే పొలాల్లో లాభ నష్టాలు ఉంటాయి కానీ పశువుల వలన లాభాలే ఎక్కువ. కష్ట కాలంలో వీటి నుంచే ఆదాయమే ఉపయోగపడుతుంది.
సాధారణంగా వర్షాకాలం మొదలవ్వగానే ఎన్నో రకాల వ్యాధులు వస్తాయి. మనం రోగాల వలన ఎలా ఇబ్బందులు పడతామో పశువులు కూడా ఆరోగ్య సమస్యలకు వస్తాయి. ముఖ్యంగా గొంతువాపు, జబ్బవాపు వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. వీటిని పట్టించుకోకపోతే ప్రాణాంతకం అయ్యే అవకాశం ఉంది. పశువుల సస్యరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పశువుల డాక్టర్స్ చెబుతున్నారు.
మనుషులకు చిన్న వ్యాధి వస్తేనే అల్లాడిపోతున్నారు అలాంటిది మూగజీవాలు పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఈ సీజన్ లో పశువులక గొంతువాపు వ్యాధి సోకుతుంది. ఇది ఎక్కువగా నల్లజాతి గేదెల్లో కనిపిస్తుంది. కలుషితమైన నీరు, మేత వలన పశువుల్లో ఇమ్మ్యూనిటీ తగ్గిపోయి ఈ వ్యాధికి గురవుతాయి. ఆ సమయంలో జ్వరం 105 డిగ్రీలు ఉంటుంది. ఈ వ్యాధిని రైతులు వెంటనే గురించి పశువైద్యులను సంప్రదించి ముందు జాగ్రత్తగా టీకాలు వేయించాలని నిపుణులు చెబుతున్నారు.