Minister Tummala : పంటల సాగులో ఆధునిక మెళకువలతో అధిక దిగుబడులు : మంత్రి తుమ్మల
పంటల సాగు(Crop cultivation)లో రైతులు ఆధునిక మెళకువలు(Modern techniques) పాటించి అధిక దిగుబడులు పొందే ప్రయత్నం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు (Tummala Nageswara Rao) రైతులకు సూచించారు.
దిశ, వెబ్ డెస్క్ : పంటల సాగు(Crop cultivation)లో రైతులు ఆధునిక మెళకువలు(Modern techniques) పాటించి అధిక దిగుబడులు పొందే ప్రయత్నం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు (Tummala Nageswara Rao) రైతులకు సూచించారు. సచివాలయం నుంచి రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో ముచ్చటించారు. రైతులతో పంటల సాగు, ధాన్యం, పత్తి కొనుగోళ్లు వంటి అంశాలపై చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొనుగోలు కేంద్రాలు, సీసీఐ సెంటర్ల వద్ద ఉన్న రైతులు, అధికారులతో మాట్లాడిన మంత్రి కొనుగోళ్లు జరుగుతున్న తీరుపై రైతులతో, అధికారులతో వివరాలు తెలుసుకున్నారు. పంట అవశేషాలు కాల్చడం వల్ల జరిగే అనర్ధాలపై రైతులకు మంత్రి వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ పంటల సాగులో ఆధునిక పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడం, పంటల మార్పిడి వంటి మెళకువలతో సాగును లాభసాటిగా చేసుకోవాలని సూచించారు. మార్కెట్ కు అనుగుణంగా డిమాండ్ ను గమనించి పంటల సాగు చేయాలని, అయిల్ పామ్ వంటి వాటికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందన్నారు.